పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పెళ్లి వార్త ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే మారుతుంది
ఈ టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటాడా..? అని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు
ఈ తరుణంలో ప్రభాస్‌కు పెళ్లి జరిగిపోయినట్లు, ఆయన భార్య పిల్లలు వీరేనంటూ తాజాగా నెట్టింట కొన్ని ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి
ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే అవి నిజమైన ఫొటోలు కావు. ఏఐ మాయతో ప్రభాస్ ఫ్యాన్స్ సృష్టించినవి
ప్రస్తుతం ఏఐ మాయతో చేసిన ప్రభాస్ భార్య, పిల్లల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీల ఫొటోలు ఇలా నెట్టింట ప్రత్యక్షం అవుతున్న సంగతి తెలిసిందే
ఆ మధ్య ప్రభాస్-అనుష్కలు ప్రేమాయణం నడుపుతున్నారని, త్వరలో పెళ్లి చేసుకోనున్నారని పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేశాయి
ఇక రాధేశ్యామ్ విడుదల సందర్భంగా ప్రేమ విషయంలో తన అంచనాలు తప్పాయని ఈ హీరో చెప్పడం చర్చనీయాంశమైంది
తాజాగా ప్రభాస్ మీ పెళ్లెప్పుడు? అంటూ ఓ ఇంటర్వ్యూలో అడగగా ఎప్పటిలాగే చిలిపి సమాధానంతో దాటవేశాడు. దానికి నా దగ్గర ఇప్పుడు సమాధానం లేదు. నాకు తెలిసినప్పుడు అందరికీ చెప్తానంటూ నవ్వేశాడు
ఎక్కడకు వెళ్లినా మీ పెళ్లి గురించే అడుగుతుంటారు. అది మీకు చిరాకు తెప్పించదా?అని అడగగా.. లేదు నాకెప్పుడూ చిరాకు అనిపించదు
నేను అర్థం చేసుకోగలను వారు నా గురించి ఎంతలా ఆలోచిస్తారోనని.. అయినా అలా అడగడం సాధారణ విషయమే. వారి స్థానంలో నేనున్నా అలానే ఆలోచిస్తా' అంటూ కూల్‌గా రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఏఐ మాయతో చేసిన ప్రభాస్ భార్య, పిల్లల ఫోటోలు వైరల్ అవుతున్నాయి