రూ.వంద కోట్ల ఆస్తి పోగొట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్న చంద్రమోహన్
ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోయే నటుడు చంద్రమోహన్ అనారోగ్యంతో నవంబర్ 11న మృతి చెందిన సంగతి తెలిసిందే
50 ఏళ్లకు పైగా సినీ కెరీర్‌లో ఎన్నో ఎమోషనల్ పాత్రల్లో తన నటనతో ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించిన ఆయన నిజ జీవితంలోనూ ఓ సందర్భంలో కన్నీరు పెట్టుకున్నారు
900కు పైగా చిత్రాలు చేసిన చంద్రమోహన్ తనకు పెద్దగా ఆస్తి లేదని, ఒకానొక సమయంలో ఉన్న ఆస్తినే కోల్పోయానని గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు
హైదరాబాద్‌లోని కోంపల్లిలో గొల్లపూడి మారుతీరావు ద్రాక్ష తోట కొన్నారు. ఆయనను కూడా కొనమని చెప్పడంతో చంద్రమోహన్ కూడా 35 ఎకరాల దాకా కొన్నారు
తర్వాత దాన్ని చూసుకోవడం వీలుపడకపోవడంతో అంతా అమ్మేశారు. అప్పట్లో భూమిని అమ్ముకోవద్దని శోభన్‌బాబు చెప్తున్నా వినలేదు
చెన్నైలో 15 ఎకరాలు, శంషాబాద్‌లో ప్రధాన రహదారి పక్కన ఆరెకరాలు పూర్తిగా అమ్మేశారు. ప్రస్తుతం వాటి విలువ రూ.వందకోట్లకుపైగామాటే
ఇలా దాదాపు వందకోట్లు విలువ చేసే ఆస్తులు పోగొట్టుకున్నానని ఇంటర్వ్యూలో చెబుతూ కళ్లనీళ్ల పర్యాంతమయ్యారు. సంపాదించినవాటికన్నా పోగొట్టుకున్నవే ఎక్కువని బాధపడ్డారు
చంద్రమోహన్ తన కెరీర్‌లో స్టార్ నటుడిగా జేజేలు అందుకున్నారు. కానీ చివరి రోజుల్లో సంపాదించినదంతా పోగొట్టుకుని ఆయన సాదాసీదా జీవితం గడిపారు