పొట్టి డ్రెస్‌లో అనసూయ క్యూట్‌ లుక్స్..

అనసూయ భరద్వాజ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. బుల్లితెరపై ప్రసారమైన జబర్ధస్త్ కామెడీ షోతో యాంకర్‌గా పాపులారిటీ పొందిన ఈ భామ అనతికాలంలోనే నేమ్‌, ఫేమ్‌ సంపాదించుకుంది

ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చాలా మంది తమ వయసు దాచిపెట్టుకోవడానికి నానాపాట్లు పడుతుంటారు.. కానీ అనసూయ మాత్రం అలాకాదు

తన భర్త, పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అనసూయ తన కెరీర్‌, ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎప్పుడూ షేర్ చేస్తూనే ఉంటుంది

ఇక అనసూయ భర్త ఏం జాబ్‌ చేస్తాడు.. అసలు వీళ్ల లవ్‌ స్టోరీ ఏంటీ అనే విషయాలు చాలా మందికి తెలియదు

అనసూయ కాలేజ్ డేస్‌లో NCCలో ఉన్నప్పుడు తన భర్త సుశాంక్ భరద్వాజ్‌తో పరిచయం.. అది కాస్తా ప్రేమగా మారడం.. ఇరువురి కుటుంబాలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం.. పెళ్లి చేసుకోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి

అయితే కొందరు మాత్రం అనసూయ భర్తను చూసి 'మీ నాన్నగారా..' అంటూ కామెంట్స్ చేయడం అనసూయకు చిర్రెత్తి పోయేలా చేసారు. అనసూయ వారికి దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చింది

అందరి కెరీర్‌లు పెళ్లి తర్వాత కంచికి చేరితే.. ఈ యాంకర్మ కెరీర్ మాత్రం పెళ్లి తర్వాత మూడు ఆఫర్లు.. ఆరు సినిమాలుగా సాగిపోతూనే ఉంది

అనసూయ భర్త సుశాంక్ భరద్వాజ్ ఫైనాన్సర్, ఇన్వెస్ట్ మెంట్ ప్లానర్‌గా పని చేస్తున్నాడు. వీరికి శౌర్య, అయాన్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీరికి పెళ్లై 13 ఏళ్లు దాటింది