చురకత్తుల్లాంటి చూపులతో కట్టిపడేస్తున్న చిట్టి..

బ్లాక్‌ బాస్టర్‌ మువీ జాతి ర‌త్నాలు హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా గుర్తుందా.. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల్లో చిట్టి పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది

సూపర్ పాపులర్ అయ్యింది. ఈ సినిమాలో ఆమె చిట్టి పాత్రలో నటించి మెప్పించింది. సినిమాల కంటే ముందే ఫరియా అబ్దుల్లా యూట్యూబర్‌గా అందరికి పరిచయమే. ఇక లేటెస్ట్‌గా రవితేజ రావణాసురలో నటించి మరోసారి వావ్ అనిపించింది

తెలంగాణలోని హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన ఫరియా అబ్దుల్లా హైదరాబాద్ లయోలా కాలేజీలో మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేసింది

2021లో కరోనా టైంలో విడుదలన 'జాతిరత్నాలు' సినిమాతో సినీరంగంలోకి తెంగెట్రం చేసింది

సినిమాల్లోకి రాకముందు మోడలింగ్‌, థియేటర్‌ ఆర్టిస్ట్‌, యూట్యూబర్‌గా ఫరియా అబ్దుల్లా రాణించింది. 'నక్షత్ర' అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించి మెప్పించింది

తొలి సినిమాతో హిట్‌ అందుకున్న ఈ హైదరాబాదీ అందానికీ అవకాశాలు మాత్రం అనుకున్న రేంజ్‌లో రావడం లేదనే చెప్పాలి

మాస్‌ మహారాజ్‌ రవితేజ రావణాసురలో హీరోయిన్‌గా నటించినప్పటికీ ఈ సినిమా అనుకున్న రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది

ప్రస్తుతం అల్లరి నరేష్‌ సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్లు టాక్‌.. చిలక ప్రొడక్షన్స్‌లో అల్లరి నరేష్‌ కొత్త సినిమా త్వరలో తెరకెక్కనుంది. ఈసారైనా బ్రేక్ వస్తుందో రాదో చూడాలి