దాదాపు అందరు టాప్‌హీరోలతో వరుస ఆఫర్లు కొట్టేస్తోంది
ఓవైపు ఎంబీబీఎస్ చదువుతూనే మరోవైపు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘ఆదికేశవ’ ప్రమోషన్స్‌లో యమ బిజీగా ఉంది. ఈ మువీ నవంబర్ 24న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది
డాక్టర్ కావాలని నా చిన్ననాటి కల. నేను తప్పకుండా డాక్టర్ అవుతానని ఇంట్లో వాళ్లకు మాటిచ్చా
నటిగా రాణిస్తూనే ఎంబీబీఎస్ పూర్తి చేసేందుకూ సిద్ధమవుతున్నా.. నటిగా ప్రేక్షకుల ప్రేమాభిమానాలు పొందటం నా అదృష్టం. డాక్టర్ కావడం నా తొలి ప్రాధాన్యం. నన్నడిగితే.. ప్రతి అమ్మాయికీ వృత్తిపరంగా అలాంటి బ్యాకప్ తప్పక ఉండాలంటూ చెప్పుకొచ్చింది
శ్రీలీల ప్రస్తుతం ‘ఆదికేశవ’, ‘గుంటూరు కారం’, ‘ఉస్తాద్ భగత్‌సింగ్’, ‘ఎక్సట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాలతో బిజీగా ఉంది