బుల్లితెరపై యాంకర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం వెండితెరపై దూసుకెళ్తోంది. 'రంగస్థలం’లోని రంగమ్మత్త క్యారెక్టర్ అనసూయకు మంచి గుర్తింపుని తేవడంతో ఆఫర్లు క్యూ కట్టాయి
ఇటీవల విడుదలైన 'పెదకాపు'లో నటించిన అనసూయ ప్రస్తుతం పుష్ప 2తో పాటు పలు మువీల్లో బీజీగా ఉందీ అమ్మడు
ఇక అనసూయ సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో తన వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది
ఆమె షేర్ చేసే కొన్ని ఫోటోలు, వీడియోలకు కొందరు నెటిజన్స్ ‘ఆంటీ’అనే పదాన్ని వాడుతూ నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటారు. ‘ఆంటీ’ అనే పదంపై అనసూయ పలుమార్లు ఫైర్ అయ్యింది కూడా
అసలు ఆంటీ అనే పదం వింటే తనకు ఎందుకు నచ్చదో ఓ ఇంటర్వ్యూలో వివరించింది. ఎదైన అంశంపై నేను స్పందిస్తే చాలు.. ‘ఇంట్లో ఉండి పిల్లలను చూసుకోవచ్చు కదా ఆంటీ ’అని కామెంట్స్ పెడతారు
‘ఆంటి అనే పదం తప్పు కాదు.. కానీ చాలామంది ఇప్పుడు ఈ పదాన్ని వల్గర్‌గానే వాడుతున్నారు. చిన్న పిల్లలు, తెలిసిన వాళ్ళు ఆంటీ అని ముద్దుగా పిలుస్తారు. అలా వాళ్లు ఆంటీ అని పిలిస్తే నాకు ఇష్టమే
కానీ నా కంటే పెద్దవాళ్లు, తెలియని వాళ్లు ‘ఆంటీ’ అని మరో అర్థం వచ్చేలా పిలిస్తారు. అందుకే నాకు ఆ పదం నచ్చదు. అలా పిలిచే వాళ్లే భవిష్యత్తులో రేపిస్టులవుతారు
ఆంటీ అని పిలిపించుకోవడం ఇష్టం లేదని చెప్పిన తర్వాత..మళ్లీ మళ్లీ ఎందుకు అనాలి? పైశాచిక ఆనందం కోసం ఎదుటివాళ్లను హర్ట్ చేసే వాళ్లు తమ చుట్టుపక్కల మహిళలతో ఇంకెంత అసభ్యంగా ప్రవర్తిస్తారో అర్ధం చేసుకోండంటూ అనసూయ చెప్పుకొచ్చారు