స్వలింగ వివాహాలకు అనుమతించే దేశాలు ఇవే..

స్వలింగ వివాహాల చట్టబద్ధతకు నిరాకరిస్తూ సుప్రీంకోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే

పెళ్లనేది ప్రాథమిక హక్కు కాదని స్పష్టం చేసింది. దీని చట్టబద్ధత అంశాన్ని మాత్రం పార్లమెంటు నిర్ణయానికే వదిలేస్తూ సుప్రీం తీర్పు చెప్పింది

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇప్పటికే స్వలింగ వివాహాలకు చట్టబద్ధత, స్వలింగ జంటలకు గుర్తింపు కల్పించాయి

నెదర్లాండ్స్‌ 2001లో స్వలింగ వివాహాలకు అనుమతించిన తొలిదేశంగా నిలిచింది

ఆ తర్వాత అర్జెంటీనా 2010లో స్వలింగ వివాహాలకు చట్టబద్ధంగా గ్నీన్‌ సిగ్నల్ ఇచ్చింది

2017లో ఆస్ట్రేలియా స్వలింగ వివాహాలకు అనుమతి ఇచ్చింది. స్వలింగ వివాహాలకు జర్మనీ 2017లో చట్టబద్ధతను కల్పించింది

మెక్సికో సిటీలోనూ ఈ వివాహాలకు 2010లో చట్టబద్ధత లభించింది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) 2014లో స్వలింగ వివాహానికి గుర్తింపునిచ్చింది

ఉత్తర ఐర్లాండ్‌  2020లో ఈ వివాహాన్ని ఆమోదించింది. అమెరికాలో జులై 9, 2015 నుంచి స్వలింగ వివాహాలు అమల్లోకి చట్టబద్ధంగా అమలులోకి వచ్చాయి

ఇదే తరహాలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, నార్వే, పోర్చుగల్‌, ఫిన్లాండ్‌, తైవాన్‌, బెల్జియం, కెనడా, స్పెయిన్‌, ఫ్రాన్స్‌ వంటి 34 దేశాల్లో ఈ వివాహాలను అనుమతిస్తున్నాయి