విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం

Share this :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు మరింత దగ్గరగా,వేగంగా, పారదర్శకంగా, ఎంతో ప్రామాణికమైన,నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఆధునికతను జోడించి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.దాంట్లో భాగంగానే కార్డ్ ప్రైం సాఫ్ట్ వేర్, ఈ-స్టాంపింగ్, గ్రామ/వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలతో ప్రజలకు ఇంకా ఈజీ ప్రక్రియలో రిజిస్ట్రేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. అయితే పైలట్ ప్రాజెక్టు అనే పేరుతో ఇప్పటికే 23 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

రిజిస్ట్రేషన్ దస్తావేజులు ఇకనుండి ఆన్‌లైన్ ద్వారా కూడా సబ్మిట్ చేసే అవకాశం ప్రభుత్వం కల్పించింది. దీని ద్వారాప్రజలు తమ అప్లికేషన్ తామే స్వయంగా రూపొందించుకోవడంతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా సొంతంగా లెక్కవేసుకొని ఆన్ లైన్ ద్వారా చెల్లించే సదుపాయం ప్రభుత్వం కల్పించింది. అలాగే వారికీ కావలసిన టైములో స్లాట్ కూడా బుక్ చేసుకునే అవకాశం కల్పించింది.వారు తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా త్వరగా పూర్తి చేసుకునే అవకాశం కల్పించనుంది.

ఈ-సైన్ భద్రత కూడా కల్పించనుంది. అయితే దీంట్లో ఎలాంటి అవినీతికి ఛాన్స్ లేకుండా పూర్తి పారదర్శకతతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే రెవెన్యూ రికార్డుల్లో పేరు మార్పు కూడా స్పీడ్ గా జరగనున్నాయి. ఆధునిక సాంకేతికత వినియోగం ద్వారా ఫోర్జరీ, నకిలీ డాక్యుమెంట్ల నిర్మూలన కూడా సాధ్యం కానుంది. ఇలాంటి ఎన్నో మార్పులు జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేపట్టింది.ప్రతిపక్షాలు ఎన్నంటున్నా వాటిని పట్టించుకుపోకుండా ప్రజల క్షేమమే లక్ష్యంగా ఎన్నో పధకాలు డైరెక్ట్గా పేద వాడికి అందాలనే లక్ష్యంతో దూసుకుపోతుందిఅనడంలో ఆశ్చర్యం ఏమి లేదు.