హైకోర్టులో కేసు కొనసాగుతుండగా… దర్యాప్తు సంస్థ అధికారి ప్రెస్ మీట్లు ఏమిటి?

Share this :

స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ లో స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు ని ఏసీబీ కోర్టు 14 రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. చంద్రాబు క్వాష్ పిటీషన్ విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది.  తాజాగా చంద్రబాబు కి సంబంధించిన  కేసు ఒకవైపు హైకోర్టులో కొనసాగుతుండగా, మరొకవైపు దర్యాప్తు సంస్థ అధికారి సంజయ్ మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ లు పెట్టడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణం రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొంపతీసి ఏపీ ప్రభుత్వం సంజయ్ కి ప్రత్యేక అధికారాలు ఏమైనా కట్టబెట్టాయా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఒకవే ప్రభుత్వం తనకు ఆ అధికారాలను కట్టబెట్టినట్లుగా ఆధారాలను చూపించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఎటువంటి అనుమతి తీసుకోకుండానే సంజయ్ మీడియాతో మాట్లాడితే అది అక్రమమే అవుతుంది. ఇప్పటికైనా ఒక పోలీసు అధికారిగా సంజయ్ తన పరిమితులలో ఉండాలి. సర్వీస్ రూల్స్ ను కచ్చితంగా అనుసరించాలి. ముఖ్యమంత్రి రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడని మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే సర్వీస్ రూల్స్ కు విరుద్ధమని గుర్తించాలి.

చంద్రబాబు కి సంబంధించిన కేసు వివరాలు సంజయ్ వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే కోర్టుకు సమర్పించాలి కానీ, మీడియా ముందుకు వచ్చి మాట్లాడడమేమిటంటూ నిలదీశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఇప్పటివరకు కోర్టుకు ఎటువంటి ఆధారాలు సమర్పించలేదు. అయినా ఎవరో స్క్రిప్టు రాసిస్తే సంజయ్ మీడియా ముందుకు వచ్చి చదువుతున్నారు. ఈ కేసులో సీమెన్స్ దోషి కాదని సంజయ్ చెబుతుంటే, సీమెన్స్ కూడా దోషేనని సజ్జల అంటున్నారని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీం లో స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడుకి హైకోర్టులో తప్పకుండా న్యాయం జరుగుతుందన్న పరిపూర్ణ విశ్వాసం నాకుంది అన్నారు.