నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. సభ మొదలైన కొద్ది సేపటికే టీడీపీ వర్సెస్ వైసీపీ నేతలు నువ్వా నేనా అన్నట్లు హేటెక్కింది. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై చర్చ జరపాలంటూ టీడీపీ నేతలు పట్టుబట్టారు. ఈ క్రమంలోనే స్పీకర్ పోడియంను చుట్టు ముట్టి చంద్రబాబు అరెస్ట్ పై చర్చ జరపాలంటూ ఫ్లకార్డులతో డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మీసం తిప్పారు. అయితే దీనిపై అంబటి బాలయ్య మీసం తిప్పడం ఇక్కడ కాదు.. సినిమాల్లో నడుస్తుందని అనడంతో మాటల యుద్దం మరింత వేడెక్కింది.
సభలో జరిగిన దాని గూర్చి బాలయ్య బాబు మీడియా తో మాట్లాడుతూ.. మన రాష్ట్రం ఒక నియంత చేత పరిపాలించబడుతుందని అసలు రాష్ట్రం సంక్షేమ అభివృద్ధి వదిలేసి కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని అన్నారు. దాంట్లో భాగమే చంద్రబాబు అరెస్ట్ అని చెప్పారు. బాగా అభివృద్ధి చెందిన రాష్టాన్ని అప్పులపాలు చేసి పురోగమనం లేకుండా జగన్ ప్రభుత్వం వ్యవహారిస్తుందని అన్నారు. అసలు ఏ చట్ట ప్రకారం చంద్రబాబు ను అరెస్ట్ చేసారో చెప్పలేని స్థితుల్లో మన రాష్ట్రం ఉందని ఆయన విమర్శించారు.ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు కూడా వారిని రాబోయే ఎన్నికల్లో రోడ్లపై కి లాగుతారని ఆయన హెచ్చరించారు.
మంత్రి అంబటి రాంబాబు నా వృత్తి రీత్యా నన్ను బాగా అవమానించారని ఏదేమైనా ఉంటే నీ సినిమా రంగంలో చూసుకోమని అన్నాడు. సభ లో నన్ను రెచ్చగొట్టేమాటలతో నన్ను అవమానించాడు మరియు దమ్ముంటే రమ్మన్నాడు చూసుకుందాం.. రా.. అని అన్నాడని బాలయ్య బాబు అంబటి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.అయితే ఆయన చేసిన వ్యాఖ్యలకి బాలయ్య బాబు చిత్ర పరిశ్రమలో కొంతమంది మాత్రమే ధైర్యంగా ఉంటారని అందులో నేను ఒకడిని అని ఆయన ధైర్యంగా చెప్పారు. ఈలాంటి రాజకీయాలు చాలా చూసాం అని జగన్ ప్రభుత్వనికి హెచ్చరించారు. రానున్నది చంద్రన్న పాలనే అని ప్రజలు మంచి రోజులు వస్తాయని కీచక పాలనా నుండి విముక్తి కలుగుతుందని అన్నారు.
