Tollywood Actress Sana Khaan Mecca Trip Photos: సినిమా ఇండస్ట్రీ అదొక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎంత అందం, టాలెంట్ ఉన్నా.. ఆవగింజంత అదృష్టం కలిసి వస్తే ఓవర్ నైట్ స్టార్ అయిపోతారు. లేదంటే ఎన్ని ఉన్నా ఒక్క హిట్ కూడా కొట్టలేక ఏళ్లుగా పడిగాపులు కాసే వాళ్లు కూడా ఉన్నారు. కొందరు మాత్రం హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ముందుకు సాగుతూనే ఉంటారు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను గ్లామర్ రంగంలో బాగా ఫాలో అవుతుంటారు సినీ తారలు. అయితే నటిగా తొలి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ మాత్రం యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పేసి.. పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. ప్రస్తుతం సంసారిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది. ఇంతకీ ఈ తెలుగు హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? నందమూరి హీరోతో తొలి సినిమా చేసి హిట్ సొంతం చేసుకుంది? ఇంకా గుర్తుపట్టలేదా? అయితే మేమే చెప్పేస్తాం.. ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ పేరు సనా ఖాన్.

నందమూరి కల్యాణ్ రామ్ (Kalyan Ram) ‘కత్తి’, అక్కినేని అందగాడు నాగర్జున ‘గగనం’, ‘మిస్టర్ నూకయ్య’ వంటి తదితర చిత్రాల్లో సనాఖాన్ (Actress Sana Khaan) హీరోయిన్గా నటించింది.

తండ్రి మలయాళీ, తల్లి ముంబయ్ వాసి. ముంబయిలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ 2005లో బాలీవుడ్ (Bollywood)లో నటిగా ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో పలు సినిమాల్లో మెరిసింది ఈ భామ. దాదాపు 14 ఏళ్లపాటు ఎన్నో సినిమాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.
Also Read: ‘లోకేష్‌పై పెట్టిన కేసుల్లో పసలేదు.. సుప్రీంలో బాబుకు విజయం ఖాయం’

కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో అంటే 2019లో కొరియోగ్రాఫర్ మెల్విన్ లూయిస్‌తో ప్రేమాయణం నడిపింది. ఆ తర్వాత ఏడాది తిరగకుండానే వీరు బ్రేకప్ చెప్పుకున్నారు. ఇది జరిగిన కొద్దిరోజులకు యాక్టింగ్ వదిలేస్తున్నట్లు నటి సనాఖాన్ ప్రకటించి అందరికీ షాకిచ్చింది.
View this post on Instagram
అదే ఏడాది అంటే 2020 నవంబరులో ఇస్లామిక్ స్కాలర్ మఫ్టీ అనాస్ సయ్యద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ ఏడాది జులైలో బాబుకి జన్మనిచ్చింది.

తాజాగా సనాఖాన్ తన భర్త, కొడుకుతో కలిసి మక్కాకు వెళ్లగా.. అక్కడ వీళ్లు దిగిన ఫొటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. తొలుత నటి సనాఖాన్‌ను నెటిజన్లు గుర్తుపట్టలేకపోయారు. ఆ తర్వాత నింపాదిగా గుర్తుపట్టి ఇలా మారిపోయిందేంటి అంటూ కామెంట్ సెక్షన్లో స్పందించారు.
మరిన్ని తాజా సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.
