Millionaire David Bach Income Tips: జీవితంలో ఈ ఒక్క అలవాటు పాటిస్తే చాలు.. 60 ఏళ్ల తర్వాత దిగులే ఉండదు!

ప్రముఖ మిలియనీర్‌ చెబుతోన్న మనీ మంత్రం.. మీరూ పాటించండి

Millionaire-David-Bach
Share this :

Millionaire David Bach Financial Habits: కోట్లకు అధిపతి కావాలని ప్రతి సామాన్యుడు కలలుగంటాడు. అందుకోసం ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాడు. వచ్చే ఆదాయాన్ని ఎలా ఖర్చు చేయాలి? తన సంపాదనలో మిగిలిన దాన్ని ఎలా మదుపు చేయాలో, ఎందులో పెట్టుబడి పెట్టాలోనని బుర్రలు బద్దలు కొట్టుకుంటాడు. జీవితానికి ఆర్థిక భద్రత (financial security Tips) కల్పించే దిశలో రకరకాల ప్లాన్లు వేస్తుంటాడు. అందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తుంటారు. వాటిల్లో ఎన్ని ఫలిస్తాయి.. ఎన్ని ఫెయిల్‌ అవుతాయనే విషయం పక్కనబెడితే జీవితంలో ఉన్నతస్థాయికి చేరాలనేది ప్రతి ఒక్కరి ఆశ. అయితే ఇలా చేస్తే.. అలా చేస్తే.. లైఫ్‌లో ఖచ్చితంగా సక్సెస్‌ రుచి చూడవచ్చని ఎవరూ బ్లూప్రింట్‌ తీసుకొచ్చి చేతుల్లో పెట్టరు. ఎవరి దారి వారు వెతుక్కోవాల్సిందే. అయితే తాజాగా మిలియనీర్‌, ప్రముఖ రచయిత డేవిడ్‌ బాష్‌ (David Bach) ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. జీవితంలో త్వరగా ధనవంతులుగా (Income) మారాలనుకుంటున్న వారికి డేవిడ్‌ (Millionaire David Bach) మూడు రూల్స్‌ సూచిస్తున్నారు. అవేంటంటే..

Also Read: Actress Amala Paul 2nd Marriage: రెండోపెళ్లికి సిద్ధమైన స్టార్‌ హీరోయిన్‌.. బాయ్‌ఫ్రెండ్‌ రొమాంటిక్‌ ప్రపోజల్‌ వీడియో చూశారా?

రోజుకో గంట ఆదాయం పొదుపు 

ప్రతీ వ్యక్తి తన ఆదాయం (Income)లో కనీసం 14 శాతం పక్కన పెట్టాలనలి డేవిడ్‌ బాష్‌ (David Bach) సూచిస్తున్నారు. ఒక మనిషి తన జీవిత కాలంలో సగటున 9 వేల గంటలు పనిచేస్తారని ఆయన చెబుతున్నారు. అంటే 35 సంవత్సరాలన్నమాట. రోజుకి ఒక గంట ఆదాయాన్ని (keep the first hour of the day of your income) పక్కన పెడితేచాలు మీరు ధనవంతులవుతారని మనీ మంత్రం చెబుతున్నారు. అంటే రోజుకి 14 శాతం ఆదాయం పక్కన పెడితే ఆటోమేటిక్‌ మిలియనీర్‌ అవుతారట. నెల జీతం వచ్చీరాగానే ఆదాయం అంతా ఇంటి అద్దెలు, ఈఎమ్‌ఐలు, హెల్త్‌ చెకప్‌లు (healthcare), ఆహారం, క్రెడిట్ కార్డు, రవాణా అంటూ అనేక అవసరాలకు ఖర్చయిపోతుంది. పొదుపు చేద్దామంటే ఒక్క రూపాయి కూడా మిగలదు. అందుకే రోజులో మొదటి గంట ఆదాయాన్ని (savings) ముందే పక్కన పెట్టుకోవాలి. అంటే ఉదయం 9 గంటలకు మీ పని ప్రారంభమయితే 10 గంటల వరకు వచ్చే ఆదాయం పొదుపు చేయాలి. ఇలా జీవితంలో 90 వేల గంటలు (35 ఏళ్లు) ద్వారా వచ్చిన ఆదాయాన్నిపక్కన పెట్టేయాలి.

రిటైర్‌మెంట్‌ తర్వాత ఆర్ధిక బరోసా

చాలా మంది 60 ఏళ్లకు రిటైర్‌ అవుతుంటారు. అప్పటికీ వారి అసవరాలకు సరిపడా డబ్బుల్లేక ఇబ్బందులు పడుతుంటారు. ఈ ఇబ్బందులు గమనించిన డేవిడ్‌ రోజూ ఒక గంట ఆదాయాన్ని పక్కకు తీసి పొదుపు చేస్తే రిటైర్‌మెంట్‌ తర్వాత జీవితం ఆనందంగా గడపడానికి సరిపడా ఆదాయం (Income) లభిస్తుందని చెబుతున్నారు. దీన్ని అలవాటుగా చేసుకొని జీవితాంతం పాటించాలని సూచిస్తున్నారు. ఈ మూడు అలవాట్లను (David Bach rules for becoming an automatic millionaire.) జీవితంలో భాగంగా మార్చుకుంటే మలిదశలో ఆర్థిక ఇబ్బందుల నుంచి సులువుగా బయటపడొచ్చంటున్నారు.

Also Read: Rajasthan Land Dispute Murder: దారుణ ఘటన.. ట్రాక్టర్‌తో 8 సార్లు తొక్కించి సోదరుడి హత్య! వీడియో వైరల్

కాగా డేవిడ్‌ బాష్‌ (David Bach) అమెరికాలోని ఓ మిలియనీర్‌. న్యూయార్క్ బెస్ట్‌ సెల్లింగ్‌ రచయితల్లో ఒకరుగా ప్రసిద్ధి. ఆయన ప్రజల్లో ఆర్థిక అవగాహన కలిగించేందుకు ఓ బ్లాగ్‌ను, యూట్యూబ్‌ ఛానల్‌ను కూడా నిర్వహిస్తున్నారు.