ఇందిరమ్మ కాల్నీలో ఇండ్ల తావులు ఇట్టానుసారం అమ్ముతాండ్రని ముఖ్యమంత్రికి అజ్జీ పెడతాండ.. గునాది లచ్చలకు అమ్ముతాండరు.. లచ్చలకు అమ్మేటోల్లు.. ఈళ్ల ఎనాకాల ఓరోరు ఉండారో అందిర్కీ ఉంటాది ఇంగ సూస్కొండి..
తావుల కాడ అన్నాయం మింద ఎవురికి ఎన్ని సెప్నా ఏస్ట్ .. ఒక్కరు గూడ పట్టిచ్చుకోలా.. ఆపీసారోల్లు, కలెకటేరు, అమ్మెల్యే ఏం సేయల్యా.. నా ఖతేందో చెప్తా..
ఏంది న్నా..రోజూ ఏందో ఒక అన్నాయం మింద రాస్సానే ఉండావు..ఓరాన్నా పలకతా ఉండారా అన్నా..
నా కల్లకు కనిపిచ్చినవి రాస్సాండబ్బీ.. పట్టిచ్చుకోక పోతే నేనేం సేయాలబ్బీ..
అట్టంటే యెట్టన్నా..
ఏం సెద్దాం బ్బీ..దున్నపోతు మింద వాన పడినట్టు ఉండాది ఈల్ల పని.. ఏం పట్టిచ్చుకోరు..
ల్యా..లే బ్బీ.. రాసీడు ఇందిరమ్మ కాల్నీలో తావులు అమ్ముతాండ్రని రోజూ రాస్సానే ఉండా..
ఆ యాదవుల పల్యాయప్ప, అడ్డేరు పల్యాయప్ప ఇంగా ఉండారని సెప్తాంటే..
ఈ.ఆర్.ఓ, ఈ.ఆర్.ఎ లు పట్టిచుకుని ఆ తాసీళ్దార్ కు సెప్పడం ల్యా..
ఏం రా అని సూస్సే ఈల్లే రెండు, మూడు బిల్లింగులు కట్టుకున్యారు.. ఇంగ తావుల మింద ఈల్లు ఏం సెప్తారు..
అమ్మెల్యే సారూ రాసింది సదివి గమ్ముగా ఉంటాడు..ఆయన పట్టిచ్చుకొక పోతే యెట్లబ్బా..
రాసేదంతా యేస్ట్ బ్బా.. అమ్మే ఓల్లు గూడ అమ్మల్యే సారూ పేరే సెప్పి అమ్ముకుంటాండ్రు.. అని కాల్నీ ఒళ్ళు సెప్తాండరు..
భూములు అమ్మెల్యే సారూ కాపాడతాడని సూస్కోని ఉంటే యేం పట్టిచ్చు కాకుండా గమ్ముగా ఉండాడు..ఏం సేయలా బ్బా..
ఇట్టా గాదు లే.. కథ మార్చాల.. ఒక పక్క రాస్సానే ఉంగో పక్క పెద్ద ఆపీసల్లకు అజ్జీలు పెట్టాల..
దొంగ పట్టాలు పెట్టి తావులు తీసుకున్యోల్లు, దొంగ పట్టాలు ఇచ్చి తావులు అమ్మినోల్ల మింద అజ్జి నేనే పెడ్తా..
నా దెగ్గెర ఉండే సాచ్చాలు పెట్టి కలెకటేరు సారుకు తోందల్లో అజ్జి పెట్టి ఆడ ఉండే ఓల్ల పట్టాల మింద ఇచారణ సేయాలని శెప్తా..
ఎవురేవురికి ఎప్పుడెప్పుడు పట్టాలిచ్చినారో సూడండి సారు అని సెప్తా..
నేను రాస్సాంటే ఏం తెలీనట్టు ఆపీసొల్లు నటిస్సాండరు..ఇంగ నటిస్సే ఒల్లకు సేప్తా కథ..
ఇన్గ ఇజిలెన్స్( విజిలెన్స్) సారు వొల్లకు అజ్జీ పెత్తా.. ఎవురు తప్పుడోల్లు, దొంగ పట్టాలు ఉండాయో వాళ్ళను పట్టుకోవాల..వాళ్లకు ఎవురు ఇచ్చినారో ఓల్లను పట్టుకొని జైల్ కు పంపిచ్చు సార్ అని అజ్జీ పెడతా..
ఇంగా లంచాలు (ఏసీబీ) తీసుకునే టోలోల్లను పట్టుకుంటాండ్లా ఆ సారోల్ల కు గూడ అజ్జీ పెడ్తా.. కోట్లు కోట్లకు తావులు అమ్మెస్సాండరు సార్ అని పెడ్తా..
ఇంగా మా బావ సెప్పినట్లు లోకాయుక్త కు(జడ్జీలకు) పెట్టి తప్పు సేసినోల్ల ఈపులు పగల గొట్టిస్సా ఉండండి..
నాలుగు రోజుల్లో రాసీట్లో సారోల్లు పట్టిచ్చు కోక పొతే నేనే అజ్జీ పెడ్తా..
నా దెగ్గెర ఉండే సాచ్చాలు పెట్టి దొంగోల్ల తోపాటు ఆపీసల్ల మింద అజ్జీలు పెడ్తానోచ్..ఇంగ మీ ఇష్ట మోచ్..
ఇంగ రోంత మందిని ఇండ్లు కట్నీకుండా కొట్టను పోయినారంట ఈ దొంగోల్లు వోల్ల కాడికి పొయోచ్చా..ఇంగా ఈల్ల అరాచకాలు ఎన్ని బైట పడతాయో సూచ్చా..
– సముద్రవాణి
