మాజీ భార్యతో ఇంకా ఆ పనిచేస్తున్న అక్కినేని హీరో

Share this :

అక్కినేని సుమంత్ గతంలో ఎన్నో సినిమాలతో అలరించినప్పటికీ ప్రెసెంట్ ఆయన అంత ఫామ్ లో లేని హీరో గా ఉన్నారు.ఆయనకు హీరోగా అవకాశాలు లేకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం సినిమాల్లో చేస్తున్నారు.ఇటీవల వచ్చిన సీతారామం మూవీ లో ఒక ముఖ్య భూమికను పోషించారు. అలాగే సార్ మూవీ లో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో మెరిసారు.

ఆయన తొలిప్రేమ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి రెడ్డిని 2004లో పెళ్ళి చేసుకొని ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల వారు రెండేళ్లకే విడిపోయారు.అయితే పెళ్ళై విడాకులు తీసుకున్నాక మాత్రం సుమంత్ కేరిర్ పరంగా బాగా డల్ అయిపోయాడు.అయితే మరలా ఇటీవల కాలంలో సినిమాలతో బిజీ అవుతున్నారు.

అక్కినేని సుమంత్ కీర్తి రెడ్డి కి డైవర్స్ ఇచ్చిన తర్వాత పెళ్ళి చేయనుకోకుండా ఒంటరిగానే ఉంటున్నారు.కానీ ఆమె మాత్రం బెంగళూరుకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకొని హ్యాపీగా పిల్లలతో లైఫ్ ని ఎంజయ్ చేస్తుంది. అయితే కీర్తి రెడ్డి కి రెండో పెళ్లి అయినా కూడా సుమంత్ తో ఇప్పటికీ ఆ పనిచేస్తుందని ఒక న్యూస్ సోషల్ మీడియా లో చక్కెర్లు కొడుతోంది.అదేంటంటే ఇటీవల అక్కినేని సుమంత్ ఓ ముఖ ముఖి సంభాషణలో పాల్గొని మాకు విడాకులు ఇచ్చిన తర్వాత కూడా మేమిద్దరం ఫ్రెండ్లీ గానే ఉంటున్నామని ప్రతిరోజు కీర్తి రెడ్డి నేను ఫోన్ లో మాట్లాడుకుంటాం అని అలాగే చాటింగ్ కూడా చేసుకుంటాం అని సుమంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.