“చంద్రముఖి 2” ట్రైలర్ రివ్యూ..!

Share this :

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నయనతార హీరోయిన్గా పి వాసు దర్శకత్వంలో రూపొందిన చంద్రముఖి సినిమా ఏ రేంజ్ విజయం అందుకుందో మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఆ సమయంలో అద్భుతమైన విజయం సాధించిన చంద్రముఖి సినిమాకి సీక్వెల్ గా ప్రస్తుతం పీ వాసు రాఘవ లారెన్స్ హీరోగా చంద్రముఖి 2 అనే మూవీని రూపొందించాడు.

ఈ సినిమాను ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనున్నారు. ఆ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఇకపోతే ఈ ట్రైలర్ ఆధ్యాంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది అని చెప్పలేము ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్ దాదాపు చంద్రముఖి సినిమా మాదిరిగానే ఉంది.

ఇందులోను లారెన్స్ రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించాడు. ఇకపోతే వడివేలు కూడా చంద్రముఖి సినిమాలోని చేసినటువంటి పాత్రలోనే కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే కంగనా రనౌత్ ఈ సినిమాలో ఒక నాట్య కళాకారిణిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకునే విధంగా లేదు అని చెప్పవచ్చు.