అనంతపురం, డిసెంబర్ 11: గుర్తుతెలియని వ్యక్తి చనిపోయి మూడు రోజులవుతున్నా ఎవరూ గమనించలేదు. దుర్వాసన వస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో వీధి కుక్కలు (stray dogs) మృతదేహాన్ని (dead body) పీకుతున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా (Anantapur district)వజ్రకరూరు మండలం గూలపాళ్యం రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన వెలుగు చూసింది. అతను ఎవరు అన్నది కూడా అక్కడున్న స్థానికులు తెలియరాలేదు. రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి చనిపోయి దాదాపు మూడు రోజులు అవుతుంది.
అయితే స్థానికులు చూసేటప్పటికీ మృతదేహాన్ని అక్కడ ఉన్న వీధి కుక్కలు అప్పటికే పీకు తింటున్నాయి. మృతదేహాన్ని కుక్కలు పీక్కు తినడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి వచ్చి అతను ఎవరు అనే దానిపై ఆరా తీస్తున్నారు. అయితే మూడు రోజుల నుంచి ఆ డెడ్ బాడీ అక్కడే ఉన్నప్పటికీ ఎవరూ గుర్తించకపోవడం, చివరకు కుక్కలు పీకుతింటున్న పరిస్థితి వచ్చినా ఎవరూ గమనించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మన పక్కన ఉన్న మనుషులు ఏమైపోయినా పర్వాలేదు. ఎలా ఉన్నా పరవాలేదు. అసలు ఏం జరుగుతుందో చుట్టుపక్కల ఎవరూ పట్టించుకునే పరిస్థితుల్లో లేరు అని చెప్పడానికి ఈ సంఘటన ఓ ఉదాహరణ.
ఒక మనిషి చనిపోయి మూడు రోజులు అవుతున్నప్పటికీ ఎవరు గమనించకపోవడం కనీసం దుర్వాసన వస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో.. చివరికి వీధి కుక్కలు వచ్చి మనిషిని పిక్కు తింటున్నప్పుడు గుర్తించారు. డెడ్ బాడీని వీధి కుక్కలు పీక్కు తింటున్న సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని చనిపోయిన వ్యక్తి ఎవరు అనేదానిపై విచారణ చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
