మోదీను మెచ్చుకున్న మన్మోహన్ సింగ్

Share this :

గత కొంతకాలంగా దేశంలో బీజేపీ పాలనపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తూ వస్తుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీపై మాజీ ప్రధాని ప్రశంసలు కురిపించడం ఇప్పుడు దేశంలో చర్చనీయాంశంగా మారింది.  మోదీకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, మాజీ ప్రధాన మంత్రివర్యులు మన్మోహన్ సింగ్ కితాబునిచ్చారు. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

అసలు విషయానికి వస్తే, ప్రతీష్టాత్మక జీ – 20 సదస్సును భారత్ లో నిర్వహించడం వెనుక ప్రధాని మోదీ మరియు భారత విదేశాంగ విధానం యొక్క పని తీరు అద్భుతం అని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధాని మోదీను అభినందించారు. ఉక్రెయిన్ – రష్యా మధ్య ఏర్పడిన యుద్ధ పరిస్థితులులో భారత్ తటస్థముగా ఉండడం మంచి పరిణామంఅని, రాబోయే రోజులలో భారత విదేశాంగ విధానం అంతర్జాతీయంగా మరింత రాణించాలని మన్మోహన్ సింగ్ తెలిపారు.