రాజధాని న్యూ ఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 9మరియు 10వ తేదీలలో జరుగనున్న జీ – 20 దేశాధీనేతల శిఖరాగ్ర సదస్సులో భాగంగా భారతదేశ ప్రధాన మంత్రివర్యులు నరేంద్ర మోదీ నిర్వీరామంగా ప్రపంచ అగ్రస్థాయి నేతలతో సుమారుగా 15 కు పైగా ద్వైపాక్షిక భేటీలలో పాల్గొననున్నట్లు పీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని మోదీ తమ నివాసంలోనే అగ్రరాజ్యం అమెరికా దేశపు అధ్యక్షుడు జో బైడెన్ తో, బంగ్లాదేశ్ ప్రధాని హసీనా తో, మారిషస్ నేతలతో మరియు యూకే ప్రధాని రిషి సునాక్, ఇటలీ,జపాన్ తదితర దేశాలకు చెందిన ముఖ్య నేతలతో విరామం లేకుండా 15కు పైగా సమావేశాలలో విదేశాలకు చెందిన ముఖ్య నేతలతో వరుసగా భేటీ అవ్వనున్నారు.
మరోవైపు జీ – 20 సదస్సుకు వేదికగా ఉన్న రాజధాని నగరం న్యూ ఢిల్లీ విదేశాల అగ్రనేతల రాకతో సందడిగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. జీ – 20 సదస్సు నేపథ్యంలో ఢిల్లీ నగరం నాలుగంచెల భద్రత వలయంలో ఉంది. ఈ జీ – 20 సదస్సును మోదీ సర్కార్ చాలా ప్రతీష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి అధికారులు పూర్తి స్థాయిలో వారి వారి పనులలో నిమగ్నం అయినట్లుగా తెలుస్తుంది.
