మార్నింగ్ కన్సల్ట్ అనే సర్వే సంస్థ ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి టాప్ లో నిలిచారు. 22 దేశాల సీనియర్ నేతలను వెనక్కి నెట్టి ఈసారి కూడా మళ్లీ భారత ప్రధాని మోడీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు.అయితే గతంలో కూడా ఆయనకే వచ్చింది. ఇటీవల జీ20 సదస్సు సాధించిన విజయం తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ గ్లోబల్ లీడర్ల అప్రూవల్ రేటింగ్స్ లిస్టులో అగ్రస్థానంలో నిలిచారు.
76% రేటింగ్ తో మోడీ తొలి స్థానంలో ఉండగా, స్విట్జర్లాండ్ కు చెందిన స్విస్ ప్రెసిడెంట్ అలైన్ బెర్సేట్ 64 శాతం ఆమోదం రేటింగ్ తో రెండవ స్థానంలో నిలిచారు. ఇక మెక్సికన్ ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ మూడవ స్థానంలో నిలిచారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా 49 శాతం ఆమోదం రేటింగ్ తో నాల్గవ స్థానంలో నిలిచారు. ఇక ఐదవ స్థానంలో అల్బనీస్ 48 శాతం ఆమోదం రేటింగ్ తో ఉన్నారు. మెలోని 42 శాతం ఆమోదం రేటింగ్ తో ఆరవ స్థానంలో ఉన్నారు. 40 శాతం రేటింగ్ తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏడవ స్థానంలో ఉన్నారు.
39 శాతం రేటింగ్ తో సాంచెజ్ ఎనిమిదవ స్థానంలోనూ, 37 శాతం రేటింగ్ తో ట్రూడో తొమ్మిదవ స్థానంలోనూ ఉండగా, రిషి సునక్ 27 శాతం ఆమోదం రేటింగ్ తో 15వ స్థానంలో ఉన్నారు. మార్నింగ్ కన్సల్ట్ ప్రకారం తాజా ఆమోదం రేటింగులు సెప్టెంబర్ 6 తేదీ నుండి సెప్టెంబర్ 12వ తేదీ వరకు సేకరించిన డేటా పై ఆధారపడి ఉన్నాయి.ఈ రేటింగ్ లు వివిధ నమూనా పరిమాణాలతో ప్రతి దేశంలోని నివాసితుల యొక్క ఏడు రోజుల చలన సగటుపై ఆధారపడి ఉన్నాయని మార్నింగ్ కన్సల్ట్ పేర్కొంది. మొత్తంగా మరోమారు భారత దేశ ప్రధాని చాలా ప్రభావవంతమైన, అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా గ్లోబెల్ లీడర్స్ లో టాప్ లో ఉన్నారు.
