టాలీవుడ్ గ్లోబల్ స్టార్ హీరోగా పేరు పొందిన మెగా పవర్ స్టార్ రాంచరణ్ – శంకర్ కాంబో లో తెరకెక్కుతోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఆ మూవీలో కియారా అడ్వాణీ కథానాయిక.ఈ మూవీ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు దీనిని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘జరగండి జరగండి’ అంటూ సాగే పాట ఆన్లైన్ వేదికగా లీకైంది. అయితే అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ ఇది తెగ వైరల్ మారింది.
సాంగ్ లీక్ కావడంపై నిర్మాత దిల్‌రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించారు. పాటను లీక్ చేసిన వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా, వాట్సాప్‌తోపాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో ఈ సాంగ్ ను షేర్ చేసిన వారిపైనా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ మూవీ పొలిటికల్, యాక్షన్ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ కథాంశంతో ‘గేమ్ ఛేంజర్’ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందులో రామ్‌చరణ్ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ ఎండింగ్ దశలో ఉంది. తమన్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. ఇక, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలు వర్కింగ్ స్టిల్స్ అనధికారికంగా నెట్టింట విడుదలయ్యాయి. లీకులకు పాల్పడితే ఊరుకునేది లేదంటూ మొదట్లో చిత్ర నిర్మాణ సంస్థ హెచ్చరించింది. ఈ క్రమంలోనే తాజాగా పాట లీక్ కావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే సోషల్ మీడియా ద్వారా వెలువడిన ఈ సాంగ్ కు హుజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సాంగ్ విడుదల ఐనప్పటినుండి మూవీ పై భారీ అంచనాలు ఇంకా నెలకొన్నాయని సోషల్ మీడియా వేదికగా అభిమానులు భావిస్తున్నారు.
