ఇండియన్ చిత్ర పరిశ్రమలో తన కంటూ ఒక స్టార్ స్టేటస్ ఉన్న హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘జైలర్’ . రిటైర్డ్ పోలీసు అధికారి ముత్తువేల్ పాండ్యన్‌గా రజనీకాంత్ ఎలా అలరించారో విగ్రహాల దొంగతనం ముఠా నాయకుడైన వర్మగా వినాయకన్ అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.’హీరోకు తగ్గ విలన్’ అని అనిపించుకున్న వినాయకన్ ఇటీవల ఒక ముఖ ముఖి సంభాషణలో మాట్లాడారు. రజనీకాంత్ తనని ఎంతో ఇష్టంగా చూసుకునేవారని చెప్పారు. పారితోషికం విషయంలో వచ్చిన రూమార్స్పైనా వినాయకన్ స్పందించారు.
”సెట్స్‌లో నన్ను చూసిన ప్రతీసారి రజనీకాంత్ హగ్ చేసుకునేవారు. ఒకవేళ నేను కనిపించకపోతే ‘వినాయకన్ ఎక్కడ?’ అని అక్కడున్న వారిని అడిగేవారు. అంతకుమించి ఏం అడగగలను. అదో ఆశీర్వాదంలా భావిస్తున్నా. నటనలో ఆయన నాకెంతో స్వేచ్ఛ ఇచ్చారు. నాకు నచ్చినట్లు నటించమని చెప్పేవారు. ఆయన నా దేవుడు. సుమారు ముప్పైయి ఏళ్ల నుంచి ఆయన్ను ఫాలో అవుతున్నా” అని తెలిపారు.
‘జైలర్’ సినిమాలోని నటనకుగాను రూ.35 లక్షలు తీసుకున్నట్లు వచ్చిన వార్తలపై ఆయన స్పందిస్తూ నేను అడిగిన దాని కంటే మూడు రెట్లు అధికంగా ఇచ్చారని చెప్పారు. బాక్సాఫీసు వద్ద సుమారు రూ.600 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం సినిమా థియేటర్స్ లోనే కాదు ఓటీటీ లో కూడా మంచి జోరుమీద దూసుకుపోతుంది.
