తెలుగుదేశం పార్టీ స్థాపకుడు ఐనటుటువంటి మన మాజీ సీఎం నందమూరి తారక రామారావు గారి శతజయంతి వేడుకల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్ పాల్గొన్నారు. దాంట్లో భాగంగా ఆయనకు ఎన్టీఆర్ గారితో ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు.ఇక, టీడీపీ చీఫ్ చంద్రబాబు పరిపాలనపైనా కూడా ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అసలు ఆయనకు తెలుగు రాష్ట్రం, రాజకీయాలపై అవగాహన లేదని గట్టిగా విమర్శలు చేశారు.
రజనీకాంత్‌తో చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పించారు.ఎన్టీఆర్ అభిమానులను బాధపట్టేలా ఆయన మాట్లాడారని అన్నారు రోజా. అప్పటినుండి రోజా రజని ఫ్యాన్స్ కు టార్గెట్‌గా మారిపోయారు.అయితే ఈ రోజు తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆమె, తాను రజనీకాంత్ వాఖ్యలపై తాను విమర్శలు చేయలేదని కేవలం ఖండిచాను అని చెప్పుకొచ్చారు.
ఇకపొతే లోకేష్ తాను చేస్తున్న పాదయాత్రలో మరియు పవన్ కల్యాణ్ షూటింగ్ గ్యాప్ లో చంద్రబాబు ఇచ్చే ఫ్యాకేజిని తీసుకోని విమర్శలు చేస్తున్నారని అన్నారు. వారికొచ్చిన ఐటీ నోటీసులపై చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదు అని ఆమె నిలదీశారు.ఏదేమైనా రోజా గారు సూపర్ స్టార్ రజినీకాంత్ పై చేసిన వ్యాఖలకు ఆయన అభిమానులు గుర్రుమంటున్నారు.ఆమె చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొమ్మని అంటున్నారు తలైవా అభిమానులు.
