అమరావతి, నవంబర్ 1: చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌పై వైసీపీ నేతల్ని ప్రజలు ఛీకొడుతున్నా..ఇంకా సిగ్గులేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నారంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (TDP state president Achchennaidu) వ్యాఖ్యానించారు. ఈ భూమ్మీద తానే అపరమేధావన్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ఫీలవుతున్నారని అన్నారు. నిన్న బెయిల్ (Bail)పై విడుదలైన చంద్రబాబు (Chandra babu)కి మద్దతు తెలిపేందుకు వచ్చిన జనసందోహాన్ని చూసి సీఎం జగన్ (CM Jagan) సహా వైసీపీ (YSRCP) నేతలు వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు.
కోర్టు నిబంధనలున్నా చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకు వేలాది మంది జనం వచ్చారు. అందుకే రాజమండ్రి నుంచి విజయవాడ రావటానికి 16 గంటలు పట్టింది. అదే కోర్టు నిబంధనలు లేకుంటే అంతకు నాలుగు రెట్లు జనం వచ్చేవారన్నారు. రాజమండ్రి నుంచి విజయవాడ రావటానికి ఇక ఎన్నిరోజులు పట్టేదో? అని కోర్టు నిబంధనలు ఉల్లంఘించకుండా చంద్రబాబు నాయుడు (Chandra babu Naidu) కారులోనే ఉండి ప్రజలు, కార్యకర్తలకు చిరునవ్వుతో అభివాదం చేశారన్నారు. చంద్రబాబుకి మద్దతుగా ప్రజలు ర్యాలీ చేస్తే వైసీపీ నేతలకు ఇబ్బందేంటి? అంటూ ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడుని, లోకేశ్ (Nara Lokesh)ని చూస్తే వైసీపీ నేతలు ఎందుకంత వణికిపోతున్నారు? లోకేశ్ ఢిల్లీ (Delhi) వెళ్తే వైసీపీ నేతలు గల్లీల్లో పెడబొబ్బలు పెడుతున్నారంటూ దుయ్యబట్టారు. చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టి 52 రోజులు జైల్లో నిర్భందించారు. బెయిల్ రాకుండా అనేక కుట్రలు చేశారు. స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి ఇన్ని రోజులైనా ఒక్క ఆధారం సేకరించపోయారు. ఇప్పుడు మద్యంలో అక్రమాలంటూ చంద్రబాబు (Chandra babu)పై మరో అక్రమ కేసు పెట్టారు. ప్రజా బలం ఉన్న నాయకుడు చంద్రబాబు. ఎన్ని కేసులు పెట్టినా టీడీపీ పార్టీ జెండా దారంలోని నూలుపోగు కూడా పీకలేరు. మరో 5 నెలల తర్వాత వైసీపీ నేతల్ని ప్రజలు రాష్ట్రం నుంచి తరిమికొట్టడం ఖాయం అంటూ అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
