మంగళగిరి, నవంబర్ 4: నిజమైన ఓట్లను కాపాడేందుకు టీడీపీ (TDP) ఎంతదూరమైనా వెళ్తుంది రాష్ట్ర (Andhra Pradesh) ఎన్నికల సంఘం డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలోని అవకతవకలపై, టీడీపీ ఫిర్యాదుల పరిష్కారంపై తక్షణమే దృష్టి పెట్టాలని మంగళగిరి (Mangalgiri)లోని పార్టీ జాతీయ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు (TDP MLC Paruchuri Ashok Babu) శనివారం (నవంబర్ 4) మీడియాకు తెలిపారు. అక్టోబర్ 27న ఎన్నికల కమిషన్ వివిధ రాజకీయ పార్టీలకు అందించిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ (Draft voter list) ప్రకారం.. గత ఎన్నికల సమయంలో పోలైన ఓట్లకు అదనంగా 2024లో జరగబోయే ఎన్నికలకు (Andhra Pradesh Elections 2024) దాదాపు 7లక్షల పైచిలుకు కొత్త ఓట్లు చేరాయన్నారు. 2021-22 SSR నోటిఫికేషన్ ప్రకారం మొత్తంగా రాష్ట్రంలో 4కోట్ల7లక్షల మంది ఓటర్లను రిజిస్టర్ చేయడం జరిగిందని, ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీలకు అందించిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో అనేక అవకతవకలు ఉన్నాయని ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు (Paruchuri Ashok Babu) పేర్కొన్నారు. ఇంకా ఏమన్నారంటే..
డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు (Draft voter list)లో కొన్ని నియోజకవర్గాల్లోని కొన్ని పోలింగ్ బూత్‌లకు సంబంధిం చిన ఓటర్ల జాబితాలు లేవు. ఎలక్షన్ కమిషన్ తమకు అందించిన ఓటర్ల జాబితాలో బూత్‌ల వారీ ఓటర్ల వివరాలు లేవు. పాడేరు వంటి ఏజెన్సీ ప్రాంతాలలో బూత్‌లకు సంబంధించిన వివరాలు లేవు. మరో ప్రధాన అంశం ఏమిటంటే ఓటర్ల జాబితాలో వైసీపీ ప్రభుత్వం భారీ స్థాయిలో జరిపించిన అవకతవకలు. ముఖ్యంగా ఉరవకొండ, చీరాల, విశాఖపట్నం నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాలోని అర్హులైన ఓటర్ల (Voters)ను దారుణంగా తొలగించారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న ఫామ్ -7 దరఖాస్తులు, వాటి ద్వారా జరిగే ఓట్ల తొలగింపుకు సంబంధించిన వ్యవహారాలు చక్కబెట్టడం కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం తాడేపల్లి ప్యాలెస్వ (Tadepalli Palace )ద్ద పెద్ద బృందాన్నే నియమించింది. ఏఏ నియోజకవర్గాల్లో ఎన్ని ఓట్లు తొలగించాలి.. తద్వారా వైసీపీ అభ్యర్థుల్ని ఎలా గెలిపించాలనే పక్కా ప్రణాళికలు.. వ్యూహాలు అన్నీ తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగానే అమలవుతున్నాయి.
టీడీపీ ఓట్లు తొలగిస్తే తమ గెలుపు తేలికవుతుందనే భ్రమల్లో వైసీపీ
ఉరవకొండ నియోజకవర్గంలో 6, 7 వేల ఓట్లు తొలగిస్తే.. సహజంగా అది గెలుపోటములను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అలానే చీరాల, విశాఖపట్నం తూర్పు, పర్చూరు నియోజకవర్గాలపై కూడా దృష్టిపెట్టారు. అవేకాకుండా అనేక నియోజకవర్గాలు ప్రభుత్వ జాబితాలో ఉన్నాయి. టీడీపీ ఓట్లు, న్యూట్రల్‌గా ఉండేవారి ఓట్లు తొలగిస్తే తమపార్టీ అభ్యర్థుల గెలుపు తేలికవుతుందనే భ్రమల్లో అధికారపార్టీ ఉంది. చంద్రబాబు అరెస్ట్, ఆయన్ని జైలుకు పంపాక వైసీపీ పరిస్థితి దైన్యంగా తయారైంది. వైసీపీ నేతలు.. కా ర్యకర్తలే మా మూర్ఖుడు (జగన్ రెడ్డి) మేంచెప్పేది వినడం లేదు అని వాపోతున్నారు.
Also Read: TDP Bathyala Changalrayudu: వైసీపీ గూటికి బత్యాల..! బెర్త్ ఖాయమేనా? ఆసక్తిగా రాజంపేట రాజకీయాలు
ఓట్లను బంగారం కంటే మిన్నగా కాపాడటానికి టీడీపీ ప్రయత్నిస్తోంది

ప్రభుత్వం అర్హుల ఓట్లు తొలగించడం.. దొంగఓట్లు సృష్టించడం చేస్తుంటే..ఆ తంతులో కొందరు అధికారులు నిస్సిగ్గుగా పాలుపంచుకుంటున్నారు. కొన్నిచోట్ల వీఆర్ఏలు, వీఆర్వోలు, వాలంటీర్లు వారి ఇళ్లల్లో పెళ్లికి పనిచేసినట్టు ప్రణాళికా బద్ధంగా ఓట్లు తొలగిస్తున్నారు. వైసీపీనేతలు, అధికారపార్టీ ఎమ్మెల్యేల ఆదేశాలతో ఫామ్ -7ల ద్వారా అడ్డగోలుగా ఓట్లు తొలగిస్తున్నారు. మొన్నటికి మొన్న అనకాపల్లి జిల్లా కొవ్వూరులో వీఆర్ఏ ప్రభావతిని సస్పెండ్ చేశారు. ఆమె చేసిన అతిపెద్ద తప్పేమిటంటే.. 13 మంది బతికున్నవారిని చనిపోయినట్టుగా ఫామ్ -7లు ఇవ్వడం. నియోజకవర్గాల వారీగా వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు ఇలాంటి తప్పులు తమ దృష్టికి వస్తున్నాయి. ఓట్లను కాపాడటానికి.. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల వారీగా చాలా జాగ్రత్తగా ఓటర్లజాబితాను పరిశీలిస్తోంది. బంగారం కంటే మిన్నగా ఓట్లను కాపాడటం కోసం శ్రమిస్తోంది.
ఎవరైనా సరే తప్పులకు మూల్యం చెల్లించుకోవాల్సిందే
నర్సీపట్నం నియోజకవర్గంలో 17 వేల ఓట్లు, మాడుగులలో 9500 ఓట్లు ఇలా పెందుర్తి, యలమంచిలి, పాయకరావు పేట, చోడవరంలలో వాలంటీర్లు ఇష్టానుసారం ప్రజల ఓట్లు తొలగించారు. ఓటర్ జాబితా పరిశీలనలో భాగంగా ఇళ్లకు వెళ్లినప్పుడు ఆ ఇళ్లల్లో ఎవరైనా లేకపోతే వాలంటీర్లు ఎవరూ లేరంటూ ఫామ్ -7ల ద్వారా ఓట్లు తీసేస్తున్నారు. ఇళ్లల్లోని ఓటర్లు స్థానికంగా లేరనో.. చనిపోయారనో చెబుతూ బూత్ కు ఇన్ని ఓట్లు తీసేయాలనే లక్ష్యంతో వాలంటీర్లు పనిచేస్తున్నారు. కాకినాడ (Kakinada)లో వైసీపీ (YSRCP) నేతలే నేరుగా ఓటర్లజాబితా పరిశీలనలో వేలుపెట్టి ఫామ్ -7 దరఖాస్తులు అందించారు. వారిపై ఫిర్యాదు చేయడంతో క్రిమినల్ కేసులు పెట్టారు. అలానే గతంలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుపతిలో పోలైన దొంగఓట్లపై పెట్టిన కేసుల్లో ఇంతవరకు ఎలాంటి పురోగతిలేదు. గ్రాడ్యుయేట్లు కాని వారు ఓట్లు వేశారని నిరూపిస్తూ.. టీడీపీ (TDP) ఆధారాలిచ్చినా ఈసీ (Election Commission) ఎందుకు చర్యలు తీసుకోలేదు? కొన్నిచోట్ల కలెక్టర్లే వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారు. ఎవరైనా సరే చేసే తప్పులకు మూల్యం చెల్లించుకుంటారు. ఎలాంటి ఫామ్ లు అందించినా అవన్నీ రికార్డెడ్ అని.. చట్టాలపరంగా తప్పించుకోలేరనే వాస్తవాన్ని అధికారులు గుర్తుంచుకోవాలంటూ పరుచూరి అశోక్ బాబు హెచ్చరించారు.
నిజమైన ఓట్లు కాపాడేందుకు టీడీపీ ఎంతదూరమైనా వెళ్తుంది
డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ప్రకారం రాష్ట్రంలో 4,02,21,450 మంది ఓట్లుంటే.. వాటిల్లో 15 లక్షల ఓట్లు కలిపారు. మరో 13 లక్షల ఓట్లు తొలగించారు. 6.50 లక్షల ఓట్లను ఆధార్ ఎన్రోల్మెంట్ (Aadhaar) కింద చూపారు. ఆధార్ ఎన్రోల్మెంట్ (Aadhaar Enrollment) అంటే ఏమిటో..? ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి. వేర్వేరు ప్రాంతాల్లో రెండు ఓట్లు ఉంటే.. ఆధార్ సీడింగ్ ప్రొసీజర్ ప్రకారం BLOలు తొలగించే ఓట్లపై కూడా కమిషన్ దృష్టి పెట్టాలి. టీడీపీ ఫిర్యాదులపై స్పందించి, సున్నా (సున్నా) డోర్ నెంబర్లు.. తప్పుడు డోర్ నెంబర్లపై ఎలక్షన్ కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలి. అలాగే వైసీపీ ఎమ్మెల్యేల ఆదేశాలతో ఇష్టానుసారం బూత్త్లు కేటాయించడంపై కూడా ఈసీ దృష్టిపెట్టాలి. ఓటరు జాబితాలో వాలంటీర్ల ప్రమేయంపై వేలుపెట్టడాన్ని ఈసీ సీరియస్‌గా తీసుకోవాలి. నిజమైన ఓట్లను కాపాడేందుకు టీడీపీ ఎంతదూరమైనా వెళ్తుందని మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ తాజా వార్తాకథనాల కోసం క్లిక్ చేయండి.

Comments are closed.