తిరుపతి, నవంబర్ 6: తిరుమల తిరుపతి శ్రీవారి (Tirumala Tirupati Devasthanam) దర్శనాలను సొమ్ముచేసుకునే దుస్థితికి వైసీపీ (YSRCP)నేతలు, మంత్రులు దిగజారారు. డబ్బుపిచ్చితో పవిత్రమైన టీటీడీ (TTD)ని వైసీపీ కార్యాలయంగా (YSRCP Political Hub) మార్చేలా ఉన్నారని టీడీపీ (TDP) నేత, బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర (Andhra Pradesh) అధ్యక్షుడు బుచ్చిరామ్ ప్రసాద్ (TDP Buchiram Prasad) అన్నారు. రాష్ట్రంలోని హిందూ దేవాలయాల పరిస్థితి సర్వం స్వాహా అన్నవిధంగా తయారైందన్నారు. పరమ పవిత్రమైన.. ప్రముఖ ధార్మిక విభాగమైన తిరుమల తిరుపతి దేవస్థానం (Tirupati) పనితీరు.. నానాటికీ తీసికట్టుగా తయారైందని. టీటీడీని ఈ ప్రభుత్వం వ్యాపారకేంద్రంగా మార్చేలా వ్యవహరిస్తోందని మంగళగిరి (Mangalagiri)లోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన ఆదివారం (నవంబర్ 5 )విలేకరుల సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు.
మంత్రి రోజాకు ఉన్నట్టుండి తిరుమలేశుడిపై భక్తి ఎలా పుట్టుకొచ్చిందో..?
సీఎం జగన్ (CM Jagan) ప్రభుత్వ ఆదేశాలతో టీటీడీ విభాగం గతంలో తిరుమలేశుడికి భక్తులు ప్రేమతో సమర్పించే సొమ్ముకి ఎసరు పెట్టాలని చూసింది. దానిపై ప్రతిపక్షాలు, హిందూ ధార్మికసంస్థలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెనకడుగు వేసింది. వైసీపీప్రభుత్వంలో పవిత్రమైన తిరుమల క్షేత్రం రాజకీయ, వ్యాపార కేంద్రంగా మారిందని చెప్పడానికి చింతిస్తున్నాం. ఆఖరికి స్వామివారి దర్శనాలను కూడా వైసీపీ నేతలు సొమ్ము చేసుకునే దుస్థితికి దిగజారారు. ప్రతిపక్షంలో ఉన్నప్పడు గుర్తురాని వేంకటేశ్వరస్వామి, పదవిలోకి వచ్చాక మంత్రి రోజా (Minister Roja)కు పదేపదే గుర్తుకు రావడం విడ్డూరంగా ఉంది. మంత్రి అయ్యాక వారంలో రెండుమూడుసార్లు తిరుమలకు ఎందుకు వెళ్తున్నారో ఆమే సమాధానం చెప్పాలి. టీటీడీని పైరవీల కేంద్రంగా మార్చిన మంత్రి రోజా.. నిస్సిగ్గుగా స్వామివారి దర్శనాల్ని సొమ్ము చేసుకుంటోంది.
ఇటీవల ఆమె వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ స్వామివారి ఆలయంలో అభ్యంతరకర దుస్తులతో సంచరించాడు. అతని మెడలో శిలువ గుర్తు కూడా ఉంది. అలాంటి వ్యక్తి ఆలయంలోపలికి రావడంపై టీటీడీ (TTD) ఏం సమాధానం చెబుతుందని… మంత్రితో వచ్చేవారు ఎలాంటివారైనా వారిని లోపలికి అనుమతిస్తారా? అని టీటీడీ సెక్యూరిటీ విభాగాన్ని ప్రశ్నిస్తున్నాం. స్వామి వారిని వ్యక్తిగత ప్రయోజనాలకోసం దర్శించుకునే జాబితాలో మంత్రి రోజా అగ్రస్థానంలో ఉంటే.. ఆమెతో కొందరు అధికారపార్టీ వారు పోటీపడుతున్నారు. ఆమె తర్వాత జాబితాలో మంత్రి సీదిరి అప్పలరాజు (Sidiri Appalaraju), ఉషశ్రీ చరణ్ (Ushasree Charan), ఎచ్చెర్ల వైసీపీ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ లు ఉన్నారు. మంత్రులు రోజా, సీదిరి అప్పలరాజు, ఉషశ్రీ చరణ్‌లు స్వామి వారి దర్శనాల్ని కూడా సొమ్ముచేసుకునే దుస్థితికి దిగజారారు. ఓటర్ల లిస్ట్ కంటే మంత్రుల వెంట స్వామి వారి దర్శనానికి వెళ్లేవారి జాబితా నే ఎక్కువ ఉంటోంది. ప్రజాప్రతినిధుల వెంట వచ్చేవారిలో 6 గురుకి మించి దర్శనానికి అనుమతించకూడదనే నిబందనను టీటీడీ ఎందుకు అమలు చేయడం లేదు? అధికారపక్షానికి ఒక న్యాయం.. ప్రతిపక్షాలకు మరో న్యాయమా అంటూ ప్రశ్నించారు.
టీటీడీని వైసీపీ పార్టీ కార్యాలయంగా (YSRCP Party Office) మార్చాలని చూస్తున్నట్టుంది. అదే గానీ జరిగితే ఏడుకొండలవాడి ఆగ్రహంతో వారికి జరగాల్సిన శాస్తి జరుగుతుంది. నాస్తికుడైన భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఛైర్మన్ అయినప్పటినుంచీ స్వామివారి పవిత్రత.. తిరుమల క్షేత్రమహత్యం మంటగలుస్తూనే ఉన్నాయి. గతంలో రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhara Reddy) కూడా టీటీడీ ఛైర్మన్ గా కరుణాకర్ రెడ్డిని నియమించి ఏడుకొండలకు ఎసరు పెట్టాలని చూసి ఏమయ్యాడో ప్రజలకు బాగా తెలుసని గుర్తుచేశారు. టీటీడీలో జరుగుతున్న ధర్మవిరుద్ధ…శాస్త్రవిరుద్ధ వ్యవహారాలపై పండితులు, హిందూసంఘాలు, హిందువులతో మాట్లాడి, హిందూసమాజ, ఆలయాల రక్షణకోసం ఒక ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తాం.
హిందూ దేవాలయ అర్చకులపై ఎందుకీ దాడులు?
ఇటీవల కొత్తగా వైసీపీప్రభుత్వంలో స్వామివారి సేవలో తరించే అర్చకులపై దాడులు ఎక్కువయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ సమీపంలోని చెరుకువాడ గ్రామం లో అర్చకుడిపై వైసీపీనేతలు దాడికి పాల్పడ్డారు. దాంతో స్థానిక దేవాలయం 15 రోజు లు మూతపడింది. గుంటూరులో శ్యామలానగర్‌లోని వెంకటేశ్వరస్వామి అర్చకుడిపై దాడిచేశారు. ప్రకాశం జిల్లాలో ఒక పాతశివాలయంలో అర్చకుడిని అవమానించారు. ఇలాంటి దారుణాలకు ఎందుకు పాల్పడుతున్నారో.. ప్రత్యేకంగా హిందూ సమాజంపైనే ఎందుకింత కర్కశంగా వ్యవహరిస్తున్నారో పాలకులు సమాధానం చెప్పాలి. ప్రభుత్వం లో ఉన్నవారు కులమతాలు.. వర్గవైషమ్యాలకు అతీతంగా వ్యవహరించాలనే ఆలోచన తో మసులుకోవాలని పాలకులకు సూచిస్తున్నాం. దేవుడిని నమ్ముకొని బతికేవారితో ఆటలాడితే ఎంతటివారైనా కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని.. ఆ దేవుడే అలాంటివారికి తగినశాస్తి చేస్తాడని బుచ్చిరామ్ ప్రసాద్ హెచ్చరించారు.
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ వార్తాకథనాల కోసం క్లిక్ చేయండి.

4 Comments
Comments are closed.