చంద్రబాబు ఉన్న ‘స్నేహ బ్లాక్’ ప్రత్యేకతలు అవేనా….??

Share this :

ప్రస్తుతం రాష్ట్రంలో ‘స్నేహ బ్యారక్‌’ అనే పేరు బాగా ఫేమస్ యింది. ఈ బ్యారక్ అనేది రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉంది.ఈ బ్యారక్‌కు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆర్థిక నేరాల్లో రిమాండ్‌కు వచ్చే ఖైదీలకు దీన్ని ఆ కేటాయిస్తుంటారు. ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత ఐనా చంద్రబాబునాయుడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో జ్యుడీషియల్‌ రిమాండ్‌ అనుభవిస్తున్నారని అందరికి తెలిసిన సంగతే. ఆయనకి ప్రస్తుతం అదే బ్లాక్ కేటాయించారు.

లేటెస్ట్ టెక్నాలజీ మరియు వసతులతో నిర్మించిన ఈ స్నేహ బ్లాక్‌లో 13 గదులు ఉంటాయి.చంద్రబాబు రిమాండ్‌కు వచ్చిన సందర్భంగా అప్పటికే ఉన్న ఖైదీలను అక్కడ నుంచి ఖాళీ చేయించి ఆ బ్యారక్‌ మొత్తం ఆయనకే అలాట్ చేసారు.ఇతర బ్యారక్‌ల నుంచి ఖైదీలు ఎవరూ అటు వైపు వెళ్లకుండా చాలా కట్టుదిట్టమైన భద్రత చర్యలు కూడా తీసుకున్నారు. వీఐపీలకు ఉండే సౌకర్యాలన్నీ కూడా ఆయనకు కల్పించారు.అందులో ఉన్న గదుల్లో ఒక దానిని సౌకర్యవంతంగా తయారు చేసి ఆయనకు అలాట్ చేశారు.

ఆ గదిలో ఒక ఫ్యాన్, సేదతీరేందుకు సౌకర్యమైన బెడ్, న్యూస్‌ పేపర్, ఏసీ ఉన్నట్లు తెలుస్తుంది.కాకపోతే ఆయన టీవీ అనేది ప్రొవైడ్ చేయలేదని తెలుస్తుంది.ఆయన బయటకు వెళ్లి ఇతర ఖైదీలతో కలసి టీవీ చూసే వెసులుబాటు చంద్రబాబుకు లేదు.అలాగే ఆయనకు ఒక వైద్యుడు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచారు. ఇకపొతే చంద్రబాబుకు మందులు, భోజనం అందించేందుకు ప్రత్యేకంగా ఒక వ్యక్తిని కేటాయించారు. ఆయనకు వ్యక్తిగత భద్రత కోసం ఒక నలుగుర్ని పెట్టారు. వాళ్ళతో పాటు జైలు సిబ్బంది కూడా ఆ బ్యారక్‌ చుట్టూ కాపలాగా ఉంటారు.