అమరావతి, అక్టోబర్ 24: రాష్ట్ర (Andhra Pradesh) నిరుద్యోగులకు సీఎం జగన్ (CM YS Jagan) సర్కార్ శుభవార్త చెప్పింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ -2 (Group 2) ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల సంఖ్యను పెంచుతూ ఉత్తర్వులిచ్చారు. ఇప్పటికే 508 గ్రూప్ 2 పోస్టులకు ప్రభుత్వం గ్నీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గత ఆగస్టు 28వ తేదీన జగన్ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. గతంలో ఇచ్చిన పోస్టుల సంఖ్యను మరింత పెంచాలనే ఉద్దేశంతో మరోసారి శాఖలవారీగా జూనియర్ అసిస్టెంట్స్ పోస్టుల (Junior Assistant Posts) ఖాళీల వివరాలు సేకరించింది. ఆయా శాఖల నుంచి సేకరించిన డేటా ప్రకారం మొత్తం 212 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది.

దీంతో గతంలో అనుమతిచ్చిన 508 పోస్టులకు అదనంగా మరో 212 పోస్టులను కలిపి (Group 2 Vacancies Increased) భర్తీ చేసేలా ఏపీపీఎస్సీ (APPSC)కి అనుమతిస్తూ జీవో 112 జారీ చేసింది. దీంతో ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే మొత్తం గ్రూప్ 2 ఖాళీ (APPSC Group 2 Vacancies)ల సంఖ్య 720కి చేరింది. త్వరలోనే ఈ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ (ఏపీపీఎస్సీ) (APPSC Group 2 Recruitment Notification) ఇవ్వనుంది. దీంతో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని నోటిఫికేషన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.
కొత్తగా పెరిగిన ఖాళీల వివరాలు ఇవే..
- వ్యవసాయ శాఖలో ఖాళీలు: 9
- మత్య్సశాఖలో ఖాళీలు: 10
- సివిల్ సప్లయిస్ శాఖలో ఖాళీలు: 8
- ఏపీపీఎస్సీలో ఖాళీలు: 30
- హోం శాఖలో ఖాళీలు: 22
- ఉన్నత విద్యాశాఖ ఖాళీలు: 1
- వైద్యారోగ్య శాఖలో ఖాళీలు: 21
- కార్మిక శాఖలో ఖాళీలు: 13
- మున్సిపల్ శాఖలో ఖాళీలు: 9
- మైనార్టీ శాఖలో ఖాళీలు: 2
- పంచాయతీ రాజ్ శాఖలో ఖాళీలు: 5
- ప్లానింగ్ శాఖలో ఖాళీలు: 5
- రెవెన్యూ శాఖలో ఖాళీలు: 31
- పాఠశాల విద్యాశాఖలో ఖాళీలు: 33
- సోషల్ వెల్ఫేర్ శాఖలో ఖాళీలు: 1
- రోడ్లు-భవనాలు శాఖలో ఖాళీలు: 7
- మహిళా శిశుసంక్షేమ శాఖలో ఖాళీలు: 2
- జలవనరుల శాఖలో ఖాళీలు: 1
- యువజన సర్వీసుల శాఖలో ఖాళీలు: 1
Also Read: Wife Sold Her Husband: ‘శుభలగ్నం’ సీన్ రిపీట్.. భర్తను రూ. 5 లక్షలకు వేరే మహిళకు అమ్మేసిన భార్య
