Bigg Boss Kannada 10 contestant Arrest: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అరెస్ట్‌..! హౌస్‌ లోపలికి వెళ్లి మరీ షో మధ్యలో..

బిగ్‌బాస్‌ రియాల్టీ షో చరిత్రలోనే తొలిసారిగా..

Share this :

బెంగళూరు, అక్టోబర్‌ 24: ప్రముఖ రియాల్టీ షో బిగ్‌బాస్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. దాదాపు దక్షిణాదిన అన్ని భాషల్లో బిగ్‌బాస్ రియాల్టీ షో (Bigg Boss Reality Show)లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ, హిందీలలో ఈ షో టాప్‌ రేటింగ్‌తో దూకుపోతోంది. ఇక కన్నడలో బిగ్‌బాస్‌ (Kannada Bigg Boss) షోకు కిచ్చా సందీప్‌ (Kiccha Sudeep) హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. తమిళంలో విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) హోస్ట్‌ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఆసక్తికరంగా సాగుతోన్న కన్నడ బిగ్‌బాస్‌ సీజన్‌ 10 (Bigg Boss Kannada 10)లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. హౌస్‌లో కంటెస్టెంట్‌గా ఉన్న వర్తుర్ సంతోష్ (Varthur Santosh) అరెస్ట్‌ కావడం బుల్లితెరపై పెను సంచలనం సృష్టించింది.

అరెస్టుకు ప్రధాన కారణం అదే..

హౌస్‌లోపలికి ప్రవేశించి మరీ అటవీశాఖ అధికారులు సంతోష్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ షోలో పాల్గొన్న సంతోష్‌ మెడలో ధరించిన లాకెట్‌ అందుకు ప్రధాన కారణం. సంతోష్‌ పులిగోరు (Tiger Claw pendant) ధరించి ‘బిగ్‌బాస్‌’లో పాల్గొనడంపై పలువురు అటవీ శాఖకు ఫిర్యాదు చేశారు. దీనిపై ధర్యాప్తు ప్రారంభించిన అధికారులు షో మధ్యలో బిగ్‌మాస్‌ సెట్‌లోకి అడుగుపెట్టారు. సంతోష్‌ మెడలో ధరించి ఉన్న పులిగోరు లాకెట్‌ను పరిశీలించారు. అది అసలైన పులిదేనని నిర్ధారణకు వచ్చారు. దీంతో అటవీశాఖ అధికారులు (Forest Department Officials) వర్తుర్ సంతోష్‌ను అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు. దీంతో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లి మరీ సతీష్‌ను పోలీసులు అరెస్ట్‌ (Varthur Santosh Arrest) చేయడం సంచలనం రేపింది. ఆదివారం రాత్రి జరిగిన షోలో ఈ సంఘటన జరిగింది. సంతోష్‌ అరెస్ట్‌కు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

Also Read: Wife Sold Her Husband: ‘శుభలగ్నం’ సీన్ రిపీట్.. భర్తను రూ. 5 లక్షలకు వేరే మహిళకు అమ్మేసిన భార్య

బిగ్‌బాస్‌ చరిత్రలోనే తొలిసారి అలా..

వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 (Wild Life Protection Act 1972)ను సంతోష్‌ ఉల్లంఘించినట్లు కేసు నమోదు చేశారు. కేసు రుజువైతే అతనికి 3 నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశం ఉంది.తొలుత బిగ్‌బాస్‌ నిర్వాహకులు సతీష్‌ను అప్పగించడానికి అంగీకరించలేదని సమాచారం. ఆ తర్వాత అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో అరెస్ట్ చేసేందుకు అనుమతించినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్‌ రియాల్టీ షో చరిత్రలో.. హౌస్‌ (Bigg Boss house)లోనికి వెళ్లి ఓ కంటెస్టెంట్ అరెస్ట్ అవ్వడం ఇదే తొలిసారి కావడంతో ఈ వ్యవహారం కాస్తా టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. సంతోష్‌ ప్రస్తుతం రామోహళ్లి ఫారెస్ట్ అధికారుల కస్టడీలో ఉన్నట్లు బెంగుళూరు ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రవీంద్ర (Bengaluru Forest Protection Officer Ravindra) తెలిపారు. విచారణ అనంతరం అతన్ని కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.

Also Read: Bhagavanth Kesari Director: ‘అది మా తప్పే.. సారీ!’ క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ అనిల్‌ రావిపూడి.. ఎందుకంటే

ఇంతకీ అది పులా.. మరేదైనా జంతువా?

పులిగోరు కొనుగోలుకు సంబంధించిన వివరాలను సంతోష్‌ను అడిగి తెలుసుకున్నారు. లాకెట్‌ నిజంగా పులిదా లేదా మరేదైనా ఇతర వన్యప్రాణికి సంబంధించిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దీనిని నిర్ధారించేందుకు లాకెట్‌ను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించినందుకు అతనిపై నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద FIR నమోదు చేశారు. దీనిని బట్టి కేసు ఎంత బలమైనదనేది అర్ధమవుతుంది. బెంగుళూరు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌తోపాటు కగ్గలిపూర్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌తో సహా అటవీ శాఖ అధికారులు ప్రస్తుతం లాకెట్టుకు సంబంధించి ముమ్మర విచారణలో బిజీగా ఉన్నారు.

కాగా.. వర్తూరు సంతోష్ కర్ణాటకలో మంచి గుర్తింపు ఉంది. అఖిల భారత గోసంరక్షణ కమిటీ అధ్యక్షుడిగా పని చేసిన తర్వాత సంతోష్‌ ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు.