తెలుగులో అత్యంత ప్రదాదరణ పొందిన రియాల్టీ షోలలో బిగ్ బాస్ ఒకటి. ఇకపోతే ఇప్పటికే తెలుగులో బిగ్ బాస్ బుల్లి తెరపై ఆరు సీజన్ లను… ఓటిటి ఒక సీజన్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఇది ఇలా ఉంటే నిన్నటి నుండి తెలుగు బిగ్ బాస్ 7 సీజన్ ప్రారంభం అయింది. ఇక గత కొద్ది కాలంగా ఇందులోకి ఫలానా కంటెస్టెంట్ లు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని అనేక రోజులుగా అనేక వార్తలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.
ఎట్టకేలకు ఈ షో ప్రారంభం కావడంతో ఆ వార్తలన్నీటికి చెక్ పడింది. కాకపోతే తాజాగా ఓ కొత్త వార్త తెరపై వచ్చింది. ఈ సారి బిగ్ బాస్ లోకి పర్వాలేదు అనే రేంజ్ ఉన్న కొంత మంది నటీనటులు వచ్చారు. ఇకపోతే కొంతకాలం క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగించిన శివాజీ కూడా ఈసారి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఈయన ఎంట్రీ తో చాలా మంది ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఇంతటి క్రేజ్ ఉన్న ఈ నటుడు ఈ షో కు ఎందుకు వచ్చాడు అంటూ తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. అలాగే శివాజీ కూడా కచ్చితంగా టైటిల్ తోనే వెళ్తాను అని చెప్పడంతో జనాలు కూడా బిగ్ బాస్ తో శివాజీ ప్రేక్షకులపై ఏరేంజ్ ఎంటర్ టైన్ చేస్తాడా అని వేచి చూస్తున్నారు.
