పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓ వైపు రాజకీయాలు కొనసాగిస్తూనే సినిమాలు చేస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఆయన అల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన ‘బ్రో’ మంచి విజయం అందుకుంది. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాన్ హీరోగా నటిస్తున్న ‘ఓజీ’ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. హై ఓల్టేజ్ వెలెల్ లో ఉన్న ఈ టీజర్ పవన్ అభిమానులకు కొత్త ఉత్సాహం అందించింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం “ఓజి” అనే పవర్ ప్యాకెట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి సుజిత్ దర్శకత్వం వాయిస్తూ ఉండగా దానయ్య ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా నుండి తాజాగా ఈ మూవీ బృందం వారు పవర్ స్ట్రోమ్ పేరుతో ఓ టీజర్ ను విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ఇందులో పవన్ కళ్యాణ్ తన అదిరిపోయే బాడీ లాంగ్వేజ్ తో… డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకున్నాడు.
ఈ టీజర్ అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయి పవన్ కళ్యాణ్ వాయిస్ తో ఎండ్ అయ్యింది. ఈ వీడియోను ఏ రకంగా చూసినప్పటికీ ఈ సినిమాలో భారీ రక్తపాతం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ టీజర్ కు తమన్ అందించిన మ్యూజిక్ కూడా ప్రధాన బలంగా నిలిచింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ వీడియోకు అదిరిపోయే రేంజ్ లో ఉంది అని చెప్పవచ్చు. అలాగే ఈ వీడియో ద్వారా సినిమాపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
