Chandrababu: కూటమి రాజ్యసభ రేసు, చంద్రబాబు మార్క్ లెక్కలు..!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తీవ్రంగా రాజ్యసభ సీట్లూ పై కసరత్తు!

Share this :

మారిన అసెంబ్లీ బలాబలాల ప్రకారం ఖాళీ అయ్యే అన్ని సీట్లూ కూటమికే దక్కడం ఖాయం కావడంతో, ఇప్పుడు అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. సామాజిక సమీకరణాలు, జాతీయ రాజకీయాలు మరియు త్యాగాలకు ప్రతిఫలంగా ఈ క్రింది నేతలకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. జాతీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, బీజేపీ కోటా ప్రకారం చూస్తే.. ఏపీలో కూటమి విజయానికి, కేంద్రంలో సపోర్ట్‌కు బదులుగా ఒక సీటును బీజేపీకి కేటాయించడం దాదాపు ఖాయం.

Also read: Donald Trump: యుద్ధం కోసం కొడుకు పెళ్లిని వాయిదా వేసిన ట్రంప్..?

ప్రస్తుతం రేసులో ఏపీ బీజేపీ మాజీ చీఫ్ పీవీఎన్ మాధవ్ పేరు గట్టిగా వినిపిస్తున్నప్పటికీ.. కేంద్ర పెద్దల ఒత్తిడి మేరకు ఉత్తరాదికి చెందిన ఒక కేంద్ర మంత్రిని లేదా జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తను ఏపీ నుండి రాజ్యసభకు పంపే అవకాశం ఉంది. జనసేన కోటాలో.. కూటమి ఒప్పందంలో భాగంగా జనసేనకు ఒక సీటు దక్కే ఛాన్స్ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన జనసేన సీనియర్ నేత వేములపాటి అజయ్ కుమార్ లేదా పవన్ కళ్యాణ్‌కు అత్యంత ఆప్తుడైన ఒక కీలక పారిశ్రామికవేత్తకు ఈ అవకాశం దక్కవచ్చని ప్రచారం సాగుతోంది.

టీడీపీ సీనియర్ల త్యాగాలను కూడా చంద్రబాబు పరిశీలిస్తున్నారు. గత ఎన్నికల్లో టికెట్లు రాకపోయినా, పార్టీ గెలుపు కోసం పనిచేసిన సీనియర్లకు చంద్రబాబు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వనున్నారు. ఈ లిస్టులో మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా, అలాగే ఆర్ధికంగా బలంగా ఉండే సానా సతీష్, గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ వంటి వారి పేర్లు కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక కుల సమీకరణాలు చూస్తే.. ఉత్తరాంధ్ర లేదా కోస్తా జిల్లాల్లో సోషల్ బ్యాలెన్స్ కోసం ఒక బలమైన బీసీ లేదా కాపు సామాజికవర్గ నేతకు సీటు ఇవ్వక తప్పని పరిస్థితి.

ఈ కోణంలో చూస్తే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేతలకు లక్కీ ఛాన్స్ తగలవచ్చు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, కేంద్రంలో లాబీయింగ్ చేయగల ఒక బడా పారిశ్రామికవేత్తను చంద్రబాబు దిల్లీకి పంపే వ్యూహంలో ఉన్నట్లు టాక్. వైసీపీకి కనీస బలం 44 మంది ఎమ్మెల్యేలు లేకపోవడంతో ఆ పార్టీ అభ్యర్థులను నిలబెట్టే సాహసం చేయకపోవచ్చు. ఒకవేళ నిలబెట్టినా కూటమి ఏకపక్షంగా క్లీన్‌స్వీప్ చేయడం ఖాయం.

Also read: Summer Heat: తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ సెగ..? గుడ్ల కొరత తప్పదా..? 

గతంలో వైసీపీ తరఫున గెలిచి, ఆ తర్వాత మారిన సమీకరణాల వల్ల కొందరు వైసీపీ రాజ్యసభ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ ఖాళీ అయిన స్థానాలన్నింటినీ కూటమి ఖాతాలోకి మార్చుకోవడానికి చంద్రబాబు నాయుడు పక్కా స్కెచ్ వేశారు. వైసీపీకి కనీస బలం లేకపోవడంతో, ఆ పార్టీ అభ్యర్థులను నిలబెట్టినా ఓటమి ఖాయం. అందుకే, రాబోయే ఎన్నికల్లో ఏపీ నుండి ఖాళీ అయ్యే అన్ని రాజ్యసభ స్థానాలను కూటమి ఏకపక్షంగా క్లీన్‌స్వీప్ చేయబోతోందని నంబర్లు స్పష్టం చేస్తున్నాయి.

leave a reply