ఆంధ్రప్రదేశ్ లో కొంత కాలంగా ఆడవారిపై అఘాయిత్యాలు దారుణంగా పెరిగిపోతున్నాయి. ఇంటర్ మీడియట్ చదువుతున్న భవ్యశ్రీ చనిపోయి 10 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు నింధితులను పట్టుకోలేదు. ఈ నేపథ్యంలో మంత్రి రోజాపై జనసేన నేత కిరణ్ రాయల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒక ఆడపిల్ల అనుమానస్పద స్దితిలో మృతి చెంది పదిరోజులు దాటుతున్నా జిల్లాకు చెందిన మంత్రులు రోజా, పెద్దిరెడ్డి, నారాయణ స్వామీ స్పందించకుండా నిద్రపోతూన్నారు. ‘ఆడపిల్లకు కష్టం వస్తే గన్ కన్నా జగన్ ముందు వస్తాడు’అని చెప్పినా రోజా ఎక్కడుంది? 10 రోజులైనా భవ్యశ్రీ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ రాలేదు సరికదా జిల్లా మంత్రులు కూడా పట్టించుకోకుండా ఉన్నారని కిరణ్ రాయల్ విమర్శించారు. తిరుమలలో చిరుతపులి దాడిలో చిన్నారి చనిపోతే ఇప్పటి వరకు జగన్ స్పందించలేదు.. ఇప్పుడు భవ్యశ్రీకి న్యాయం జరగాలని మాట్లాడితే కేసులు పెడుతామని చిత్తూరు ఎస్పీ ప్రజలను బెదిస్తున్నారు.
సమయం చిక్కినప్పుడల్లా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిట్టడానికి నగరి నుండి అమరావతి వెళ్లే రోజవ్వకు పక్కనే ఉండే భవ్యశ్రీ కుటుంబ భాదలు వినడానికి సమయం లేదా అంటూ ఎద్దేవా చేశారు. భవ్యశ్రీ కుటుంబానికి 50 లక్షలు సహాయం చేసి ప్రభుత్వం అదుకోవాలని జనసేన పార్టీ కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. భవ్యశ్రీ ఇంటి నుండి వెళ్లిన వెంటనే అనుమానంతో పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు న్యాయం చేయకపోగా తల్లిదండ్రుల పట్ల దురుసుగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి అందులో ఓ మహిళా మంత్రి కూడా భవ్యశ్రీ కుటుంబాని కి న్యాయం చేయకపోవడం, కనీసం పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. రోజావ్వకు మాటలు ఎక్కువ పని తక్కువ అని హెద్దేవ చేశారు, వడ్డెర కులం కు చెందిన బిసి బాలికని నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని వారు హెచ్చరించారు.
భవ్యశ్రీ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బావిలో పడి మృతి చెందడానికి భవ్యశ్రీ కి ఈత బాగా వచ్చునని, అందులో మృతదేహం కు వెంట్రుకలు ఊడి పోయి ఉండడం చూస్తుంటే కచ్చితంగా అనుమానాలకు దారితీస్తుందని, భవ్యశ్రీ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకోవాలని, బీసీలను చిన్న చూపు చూస్తే చూస్తూ ఊరుకునేదే లేదని, తక్షణమే ఈ ఘటనపై నిజా, నిజాలు నిగ్గు తేల్చాలని, లేని పక్షాన పెద్ద ఎత్తున నిరసన చేపడుతామని కిరణ్ డిమాండ్ చేశారు. భవ్యశ్రీ అత్యాచారం పై అనుమానం వ్యక్తమవుతున్నదని జనసేన పార్టీ నేతలు అడ్వకేట్ వనజ, అరుణ, రాజేష్ ఆచారి, కిషోర్, రమేష్ నాయుడు, గుట్టా నాగరాజు, ఆది తదితరులతో కలిసి కిరణ్ రాయల్ ఆవేదన వ్యక్తం చేశారు
