AP High Court Verdict on Skill Development Corporation Scam Case అమరావతి, నవంబర్ 20: స్కిల్ డెవలప్మెంట్ కేసు (Skill Development Corporation scam case)లో టీడీపీ (TDP) అధినేత చంద్రబాబుకు (Chandrababu Naidu) రాష్ట్ర హైకోర్టు (AP High Court) సోమవారం (నవంబర్ 20) రెగ్యులర్ బెయిల్ (regular bail to Chandrababu Naidu) మంజూరు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించారు. ఇప్పటికే మధ్యంతర బెయిల్‌పై బయటికి వచ్చిన బాబు నవంబర్ 28న తిరిగి రాజమహేంద్రవరం జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని తీర్పు సందర్భంగా ధర్మాసనం పేర్కొంది.
మధ్యంతర బెయిల్ (interim bail) మంజూరు సమయంలో విధించిన షరతులు ఈ నెల 28 వరకే వర్తిస్తాయని, 29 నుంచి రాజకీయ ర్యాలీలు, సభల్లో చంద్రబాబు (Chandrababu Naidu) పాల్గొనవచ్చని న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జున్‌రావు తెలిపారు. అయితే ఈ నెల 30న ఏసీబీ కోర్టు (regular bail to Chandrababu Naidu) ముందు చంద్రబాబు హాజరుకావాల్సి ఉంటుందని కోర్టు తెల్పింది. బాబు చికిత్సకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టులో అందించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
చదవండి: ODI World Cup 2023: వరల్డ్ కప్ చేజార్చుకున్న టీం ఇండియా.. తట్టుకోలేక ఆగిన యువకుడి గుండె!!
ఈ కేసులో చంద్రబాబును అరెస్టు చేసిన తీరు సరిగా లేదని, కేసు కొట్టివెయ్యాలని, బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు తరపున సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ లూత్రా ఇటీవల వాదనలు వినిపించారు. మరోవైపు కేసు కీలక దశలో ఉందనీ, ఈ దశలో చంద్రబాబుకి బెయిల్ (regular bail to Chandrababu Naidu) ఇస్తే, సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర రెడ్డి వాదనలు వినిపించారు. రెండువైపులా వాదనలు విన్న హైకోర్టు (AP High Court) తీర్పు రిజర్వ్ చేసి, ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. సాక్షులను ప్రభావితం చేస్తారన్న ప్రాసిక్యూషన్ వాదనకు ఎలాంటి ఆధారాల్లేవని, నిధులు విడుదల చేసినంత మాత్రాన నేరంలో పాత్ర ఉందని చెప్పలేమని న్యాయమూర్తి అన్నారు. టీడీపీకి చంద్రబాబు నిధులు మళ్లింపుపై ఆధారాలు లేవని, ప్రతి ఉపగుత్తేదారు తప్పులకు సీఎంను బాధ్యుడిని చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.
నిథుల ఉల్లంఘనలపై అధికారులు సీఎంకు చెప్పినట్లు ప్రాథమిక ఆధారాలు లేవన్నారు. ఈ కేసు విచారణ మొదలయ్యాక 22 నెలలు చంద్రబాబు బయటే ఉన్నారు.. కొద్ది రోజుల ముందే కేసు నమోదు చేసి చంద్రబాబును అరెస్టు చేశారనొ, విచారణ కాలంలో కేసును ప్రభావితం చేశారనేందుకు ఒక్క ఆధారం లేదని జడ్జిస్ టి మల్లికార్జున్ అన్నారు. జడ్ ప్లస్ కేటగిరీలో ఎన్ఎస్జీ భద్రతలో ఉన్న ఆయన కేసు విచారణ నుంచి తప్పించుకునే అవకాశమే లేదన్నారు. అలాగే.. సీమెన్స్ డైరెక్టర్, డిజైన్‌టెక్ యజమాని వాట్సప్ సందేశాలకు, చంద్రబాబుకు సంబంధం ఏంటని తీర్పు సందర్భంగా ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు లాయర్ల వాదనలతో ఏకీభవిస్తున్నట్లు తీర్పు వెల్లడి సందర్భంగా హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
