తిరుపతి, నవంబర్ 20: ఓడీఐ వరల్డ్ కప్ (ODI World Cup 2023)లో టీంఇండియా (Team India) ఓటమి ప్రతి ఒక్కరినీ నిరాశ పరిచింది. కోహ్లీ, రోహిత్ సర్వశక్తులు ఒడ్డినా, బుమ్రా, షమీలు శ్రమను ధారపోసినా.. భారత్‌కు మూడోసారి ప్రపంచకప్ (World Cup) అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. బ్యాటింగ్ వైఫల్యాలకు దారుణమైన ఫీల్డింగ్ తోడు కావడంతో భారత్ ప్రపంచకప్‌ను చేజార్చుకుంది. ఆసీస్ (Australia) ఎగరేసుకుపోయింది. దీంతో కోట్ల మంది అభిమానుల ఆశలు అడియాశలయ్యాయి.
ఆదివారం (నవంబర్ 19) జరిగిన ఈ మ్యాచ్‌ను కోట్లాది మంది ప్రేక్షకులు టీవీలలో వీక్షించారు. వేల మంది స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించారు కూడా. భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీం ఇండియా ఓటమి పాలవ్వడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో తిరుపతి (Tirupati)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. టీం ఇండియా పరాజయాన్ని తట్టుకోలేక ఓ యువకుడి గుండె (Heart Attack)నిజంగానే ఆగిపోయింది. క్రికెట్ (Cricket) చూస్తూనే ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. అసలేం జరిగిందంటే..
చదవండి: Selfie in Voting Booth: సెల్ఫీ దిగితే ఓటు హక్కు రద్దు.. 3 నెలల జైలు శిక్ష! ఎందుకో తెలుసా..
తిరుపతి జిల్లా రూరల్ మండలం దుర్గ సముద్రానికి చెందిన జ్యోతి కుమార్ బీటెక్ పూర్తి చేసి.. స్థానికంగా కంప్యూటర్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను అతడు తన స్నేహితులతో కలిసి ఇంట్లోనే వీక్షిస్తున్నాడు. భారత్ బ్యాటింగ్ సమయంలో తీవ్ర నిరాశ కలిగినా.. బౌలర్స్ అయినా మ్యాచ్ గెలిపిస్తారని ఆశపడ్డాడు. కానీ ఆ తర్వాత క్రమంగా మ్యాచ్ చేజారుతుండటంతో జ్యోతి కుమార్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఆస్ట్రేలియా గెలుపు, ఇండియా ఓటమి తర్వాత ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టుకోవడాన్ని చూసి జ్యోతి కుమార్ తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో జ్యోతి కుమార్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి స్నేహితులు అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను గుండెపోటుతో మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కుమారుడి హఠాన్మరణంతో తల్లిదండ్రులు విలపించిన తీరు చూపరులను కలచివేసింది. ‘క్రికెట్ చూడకుండా ఉండినా నా కొడుకు బతికుంటే వాడేమో’నని ఆ తల్లి గుండెలు బాధుకుంటూ రోధించింది.
కాగా మోదీ స్టేడియంలో జరిగిన ప్రపంచకప్ టోర్నీ (ODI Worldcup 2023)లో తొలి నుంచి అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న టీమ్ఇండియా (Team India) చివరి మెట్టుపై బోల్తా కొట్టింది. ఫైనల్ మ్యాచ్‌లో గట్టి పోటీ ఇవ్వకుండా బేజారుగా ఆడటంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలోనే జ్యోతీ కుమార్ గుండె ఆగిపోయింది.
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.

Comments are closed.