ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత మరియు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై తనకు సమాచారం ఇవ్వకపోవడం పట్ల ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ విస్మయం వ్యక్తం చేశారు.అయితే అరెస్టు విషయంలో ప్రభుత్వ యొక్క తీరుపై గవర్నర్ చాలా అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది. అవినీతి నిరోధకర చట్టం-2018 ప్రకారం సవరణల తర్వాత రాష్ట్రంలో ఎవరైనా ప్రజాప్రతినిధులు, అంతకుముందు మంత్రులుగా పనిచేసిన వారు నిర్వహించిన శాఖల్లో అవినీతి జరిగినట్టు ప్రభుత్వం దృష్టికి వస్తే వాటన్నింటినీ క్రోడీకరిస్తూ గవర్నర్కు ముందుగా ఒక నివేదిక సమర్పించాలి. ఆ తర్వాత గవర్నర్ను నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత మాత్రమే విచారణ చేపట్టాల్సి ఉంటుంది. కానీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేసే విషయం పై రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు అని తెలుస్తుంది.
అయితే ఆయన అరెస్టు అక్రమం, చట్ట విరుద్ధమని సీబీఐ మాజీ డైరెక్టర్ ఇప్పటికే ఎం.నాగేశ్వరరావు స్పష్టం చేశారు.గవర్నర్ అనుమతి అనేది లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం, ఎంక్వయిరీ చేయడం చట్టవిరుద్ధమని చెగుర్తు చేసారు.దీని గూర్చి ఆయన అవినీతి నిరోధక చట్టంలోని ఒక సెక్షన్ ఐనా 17ఎ(సి) గవర్నర్ అనుమతి తప్పనిసరని వెల్లడించారు. ఒకవేళ వాళ్ళు గవర్నర్ పర్మిషన్ తీస్కొని ఉంటే ఆ పత్రాలు చూపించాల్సి ఉంటుందని నాగేశ్వరరావు అన్నారు.గవర్నర్ అనుమతి లేకపోతే ఎంక్వయిరీ అనేది కూడా చెల్లుబాటు కాదని ఇందుములంగా క్లియర్ గా స్పష్టం చేశారు. ఇంకా గవర్నర్ పర్మిషన్ అనేది లేకుండా అదుపులోకి తీసుకుంటే మాత్రం అది అక్రమ నిర్బంధం అవుతుందని కూడా ఆయన తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన యాక్షన్స్ తీస్కోవచ్చని కూడా అన్నారు.
