రాజమండ్రి, అక్టోబర్ 31: స్కిల్‌డెవలప్‌మెంట్ కేసు (Skill development case)లో తెలుగు దేశం పార్టీ (TDP) అధినేత చంద్రబాబు (TDP chief Nara Chandrababu Naidu)కు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ (interim bail) మంజూరు చేసింది. నాలుగు వారాల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేస్తూ మంగళవారం (అక్టోబర్ 31) హైకోర్టు (high court) న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు తీర్పు వెలువరించారు. చెరో రూ.లక్ష చొప్పున దేవినేని ఉమ, బోండా ఉమ పూచీకత్తుతో ష్యూరిటీలు సమర్పించాలని న్యాయస్థానం ఈ సందర్భంగా ఆదేశించింది. ఈ నాలుగు వారాలు తనకు నచ్చిన ఆసుపత్రిలో సొంత ఖర్చులతో చికిత్స పొందాలని కోర్టు పేర్కొంది. తిరిగి నవంబర్ 28వ తేదీన సరెండర్ అవ్వాలని, అలాగే సరెండర్ సమయంలో చికిత్స వివరాలను సీల్డ్ కవర్లో జైలు సూపరింటెండెంట్‌కు సమర్పించాలని హైకోర్టు (AP high court) సూచించింది.
అనారోగ్య కారణాలరీత్యా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిలు (Bail) మంజూరు చేయాలని చంద్రబాబు అనుబంధ పిటిషన్ (కండీషన్డ్ బెయిల్) దాఖలు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర హైకోర్టు సోమవారం (అక్టోబర్ 30) విచారణ పూర్తిచేసింది. ఈ మేరకు నేడు తీర్పు వెలువరించింది. చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ (High court) మంజూరు చేయడంతో ఏసీబీ కోర్టు రిలీజ్ ఆర్డర్ ఇచ్చింది. అయితే తిరిగి చంద్రబాబు జైలు (Jail)కు వెళ్లక తప్పదని తెలుస్తోంది. ఎందుకంటే చంద్రబాబు (Chandrababu) నేరం చేయలేదని వాళ్ల న్యాయవాదులు ఎక్కడా చెప్పకపోవడమే అందుకు కారణం. ఇక సుప్రీం కోర్టులో ఉన్న క్వాష్ పిటిషన్‌పై నిర్ణయం రావాల్సి ఉంది. త్వరలో ఆయన ఆ తర్వాత ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో కంటికి శస్త్రచికిత్స చేయించుకోనున్నారు.

మధ్యంతర బెయిల్లో కోర్టు కఠిన షరతులు ఇవే..
రాజకీయ (Politics) యాత్రలు, ప్రసంగాలు, సభలు పెట్టకూడదు. మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు. కేవలం వైద్యం కోసమే బెయిల్‌ను ఉపయోగించాలి. తన కేసుకు సంబంధించిన వివరాలను ప్రెస్, పబ్లిక్ ముందు మాట్లాడకూడదు. ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులు చంద్రబాబు కదలికలను కోర్టుకు సమర్పించాలి.
45 ఏళ్ళ నిస్వార్థ ప్రజా సేవకు, ప్రజలు చూపిస్తున్న సాటిలేని అభిమానం.#NijamGelavali#SatyamevaJayate#CBNSatyamevaJayate pic.twitter.com/Dx4wL0Vags
— Telugu Desam Party (@JaiTDP) October 31, 2023
మద్యం కేసులోనూ చంద్రబాబుకు ఊరట
మరోవైపు మద్యం కేసులోనూ (Liquor Licences case) హైకోర్టులో చంద్రబాబుకు ఊరట లభించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరించబోమని, చంద్రబాబును అరెస్ట్ చేయబోమని ఏజీ కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణ నవంబర్ 21కి వాయిదా వేసినట్లు ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. చంద్రబాబు విడుదల నేపథ్యంలో రాజమండ్రి జైలు (Rajamandry jail) వద్ద పచ్చ నేతలు సందడి చేశారు. అయితే జైలు వద్ద నెలకొన్న పరిస్థితిపై పోలీసులు సీరియస్ అయ్యారు. జైలు వద్ద శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఇంకాసేపట్లో చంద్రబాబు తన కాన్వాయ్‌లో విజయవాడకు చేరుకోనున్నారు. ఇక నవంబర్ 10న రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టనుంది.

Also Read: Bengaluru Crime : గ్యారేజీలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. 22 బస్సులు ఆగ్నికి ఆహుతి! అసలేం జరిగిందంటే
52 రోజులుగా జైలులోనే..
కాగా నంద్యాలలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెప్టెంబర్ 9న చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన్ని విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచగా.. కోర్టు రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబును రాజమహేంద్రవరం (Rajamahendravaram) జైలుకు తరలించారు. అక్కడ గత 52 రోజులుగా ఆయన జైలులో ఉన్నారు. తాజాగా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు (AP High Court grants interim bail to Chandrababu) చేయడంతో చంద్రబాబు విడుదలయ్యారు.


2 Comments
Comments are closed.