TDP Bonda Umamaheswara Rao: ‘టీడీపీకి ప్రజలిచ్చిన సొమ్ముని అవినీతిసొమ్ముగా జగన్‌ ప్రభుత్వం ప్రచారం’

జగన్ రెడ్డి అవినీతి విష పుత్రిక సాక్షి కావాలనే టీడీపీపై బురదజల్లుతోంది.. బొండా ఉమా

TDP Bonda Umamaheswara Rao TDP Bonda Umamaheswara Rao
Share this :

TDP Bonda Umamaheswara Rao మంగళగిరి, నవంబర్‌ 18: ‘అవినీతి విషపుత్రిక సాక్షి (Sakshi). తప్పుడు రాతలతో ప్రజలపక్షాన పోరాడే ప్రతిపక్షనేతల్ని తప్పుడు మనుషులుగా చిత్రీకరిస్తోంది. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పి నిజం చేయాలనే జగన్ (AP CM Jagan), వైసీపీ (YSRCP) ఆలోచనా విధానాన్ని సాక్షి మీడియా (Sakshi Media) తూచా తప్పకుండా పాటిస్తోందని, మరోపక్క సీఐడీ విభాగం జగన్ రాజకీయ కక్షసాధింపుల కోసం పనిచేసే సంస్థగా దిగజారిపోయిందని’ టీడీపీ (TDP) నేత బొండా ఉమామహేశ్వరరావు (TDP Bonda Umamaheswara Rao) అన్నారు. శుక్రవారం (నవంబర్ 17) మంగళగిరి (Mangalagiri)లోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..

‘సీఐడీ విభాగం ఇటీవల టీడీపీ (TDP) జాతీయ కార్యాలయానికి నోటీసులు పంపింది. ఆ నోటీసుల్లో సీఐడీ తమకు సంబంధంలేని, తాము అడగకూడని వివరాలు అడిగింది. తెలుగుదేశం పార్టీకి వచ్చే విరాళాల వివరాలు, ఆదాయ వ్యయాలకు సంబంధించిన సమాచారాన్ని నిబంధనల ప్రకారం ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్‌కు అందిస్తోంది. తమ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఇచ్చే వివరాలు, వాస్తవాలు కళ్లముందు కనిపిస్తున్నా కూడా జగన్ అవినీతి పుత్రిక సాక్షి కావాలనే తెలుగుదేశంపై బురదజల్లుతోంద’న్నారు.

చదవండి: Selfie in Voting Booth: సెల్ఫీ దిగితే ఓటు హక్కు రద్దు.. 3 నెలల జైలు శిక్ష! ఎందుకో తెలుసా..

4 ఏళ్ల 8నెలలు అయినా ఇప్పటికీ విషప్రచారం చేయడం తప్ప, వాస్తవాలు గ్రహించే స్థితిలోలేని జగన్‌

‘స్కిల్ డెవలప్‌మెంట్ (Skill Development) కార్పొరేషన్‌కు చెందిన కోట్లాదిరూపాయల్ని హావాలా ద్వారా టీడీపీ దారిమళ్లించిందని సాక్షిపత్రిక రాసింది. సీఎం జగన్ (AP CM Jagan) ప్రభుత్వం, అతని జేబు సంస్థ సీఐడీ మొత్తంగా నాలుగేళ్లనుంచి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్లో అవినీతి జరిగిందని చెబుతూ, విచారణ జరుపుతూనే ఉన్నాయి. జగన్ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్ల 8 నెలలు అవుతోంది. ఇప్పటికీ వాస్తవాలు కనిపెట్టకుండా తప్పుడు ప్రచారం చేస్తే ఎలా? గతంలో 2019 ఎన్నికలకు ముందు కూడా జగన్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు. ఎంపరర్ ఆఫ్ కరెప్షన్ అని తప్పుడు సమాచారంతో పుస్తకాలు ముద్రించి, చంద్రబాబు (Chandrababu) 6 లక్షలకోట్లు తినేశాడని దుష్ప్రచారం చేశాడు’.

‘అధికారంలోకి వచ్చాక అధికారులతో సమావేశమై, చంద్రబాబును జైలుకు పంపాలని, అతని అవినీతిని నిరూపిస్తే బహుమతులిస్తానని వారిని ప్రలోభపెట్టాడు కూడా. ఈ విధంగా ఎన్ని కుటిల రాజకీయాలు చేసినా నాలుగేళ్లలో ఏమీ నిరూపించలేకపోయాడు. చంద్రబాబు తప్పు చేశాడని తేల్చలేక పోయాడు. చివరకు తాను జైలుకెళ్లాడు కాబట్టి ఏదోరకంగా చంద్రబాబుని కూడా జైలుకు పంపాలన్న దుగ్థతో ఆయనపై తప్పుడు కేసులు పెట్టి 52 రోజులు జైల్లో పెట్టి, తన శునకానందం తీర్చుకున్నాడు. చంద్రబాబు పైసా అవినీతికి పాల్పడలేదని తెలియడంతో చివరకు తెలుగుదేశం పార్టీకి ప్రజల నుంచి వచ్చే విరాళాలసొమ్ము ని అవినీతి సొమ్ముగా చూపేందుకు పడరాని పాట్లు పడుతున్నాడని, తన అవినీతి మీడియాలో అసత్యాలతో దుష్ర్పచారానికి తెరలేపాడని’ బొండా ఉమా విమర్శించారు.

మా వద్ద ప్రతి పైసాకి లెక్క ఉంది.. మీరు చూపగలరా?

‘జగన్, అతని అవినీతి పత్రిక సాక్షి చేసే విషప్రచారాన్ని ఆధారాలతో సహా ఖండించడానికి తాము ఎప్పుడూ సిద్ధమేనన్నారు. తెలుగుదేశం పార్టీకి వచ్చిన విరాళాల వివరాలు ఎన్నికల కమిషన్ కు అందించినట్టే నేడు ప్రజల ముందు పెడుతున్నాం. 2014-15 లో సభ్యత్వాల ద్వారా టీడీపీకి వచ్చిన విరాళం.. రూ.53 కోట్లు. సభ్యత్వం పొందిన వారు 52,94,247 మంది. 2015-16 లో ఆన్‌లైన్ ద్వారా సభ్యత్వం తీసుకునే అవకాశం కల్పించగా 1,15,477 మంది సభ్యత్వం పొందారు. 2016-17లో 60,75,031 మంది సభ్యత్వాలు పొందారు. రెండు తెలుగురాష్ట్రాల కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి సభ్యత్వాలు నమోదు చేశారు. 2016-17లో సభ్యత్వాల ద్వారా తెలుగుదేశానికి వచ్చిన సొమ్ము అంతా 1300 బ్యాంక్ బ్రాంచుల ద్వారా వచ్చింది. తెలుగుదేశం పార్టీకి వచ్చే ప్రతిరూపాయి, ఖర్చుపెట్టే ప్రతి పైసాకి లెక్క ఉంటుంది. జగన్ మాదిరి లక్షలకోట్ల ప్రజలసొమ్ము కొట్టేసి, హావాలా మార్గాల్లో విదేశాలకు తరలించి, ఆ సొమ్ముతో ఎన్నికల్లో గెలవాలనే దుర్మార్గపు ఆలోచనలు టీడీపీ చేయదు’.

చదవండి: TDP Nakka Anand Babu: ‘అందుకే భూరక్ష పథకం నాటకాలు.. నాలుగేళ్లలో సీఎం జగన్‌ ఒక్క సెంటు భూమైనా దళితులకు ఇచ్చాడా?’

‘సీఎం జగన్‌ ఈడీ, సీబీఐ కేసుల్లో ఇరుక్కొని జైలుకెళ్లి, బెయిల్‌పై బయటకు వచ్చి జనాల్ని వంచించి అధికారంలోకి వచ్చాడు. ఇలాంటి లక్షలకోట్లు కొట్టేసే దుర్మార్గపు ఆలోచనలు టీడీపీ చేయదు. వైసీపీకి వేలకోట్లు చందాల రూపంలో ఎటునుంచి వచ్చాయో, ఎలా వచ్చాయో జగన్ రెడ్డి చెప్పగలడా? తెలుగుదేశం పార్టీకి రూ.27కోట్లు తప్పుడు మార్గంలో వచ్చాయని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా న్యాయస్థానాల్లో తప్పుడు ప్రచారం చేశాడు. రూ.27 కోట్లు ఎలా వచ్చాయో, ఏఏ మార్గాల్లో వచ్చాయో మేమే గతంలో ఆధారాలతో సహా ప్రజలముందు ఉంచాం. నేతల ద్వారా వచ్చే విరాళాలసొమ్మే కాదు, కార్యకర్తల సంక్షేమానికి ఎంత ఖర్చుపెట్టామో కూడా చెప్పాం. కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి, ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలకు రూ.100 కోట్ల వరకు ఇన్సూరెన్స్ సొమ్ము కింద అందించాము. అదీ తెలుగుదేశం చిత్తశుద్ధి. వైసీపీ నుంచి సాక్షి సంస్థకు వెళ్లిన రూ.150కోట్ల సంగతేమిటి? నిరూపించగలరా..?’

జగన్ రెడ్డి అక్రమార్జన తేల్చే ధైర్యం సీఐడీకి, సాక్షి మీడియాకు ఉందా?

‘సాక్షి పత్రిక నేడు రాసిన అసత్యాల కథనంలో మరలా స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన 90:10 నిధుల విధానాన్ని తప్పుపడుతూ పిచ్చిరాతలు రాసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేయాలనుకున్న స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు సీమెన్స్ సంస్థ రూ.2,900కోట్ల విలువైన టెక్నాలజీని, పరికరాలు అందించింది. సాంకేతిక సహాయం అందించింది తప్ప, ఎక్కడా ఎప్పుడూ డబ్బు రూపంలో రూపాయి ఇవ్వలేదు. ఈ విషయం జగన్ రెడ్డికి..అతని ప్రభుత్వానికి కూడా తెలుసు. కానీ చేతిలో అవినీతి పత్రిక ఉందని చెప్పిన అబద్ధమే చెప్పడం.. ఇదివరకు చేసిన దుష్ప్రచారాన్నే మరలా మార్చిమార్చి చేయడం చేస్తున్నారు. ఈ వాస్తవాన్ని తెలుగురాష్ట్రాలు.. ప్రపంచం మొత్తం గ్రహించినా అసత్యాలసాక్షి మాత్రం ఇంకా బురదజల్లుతూనే ఉంది’.

‘చంద్రబాబు తప్పు చేశాడని.. తెలుగుదేశం పార్టీకి వచ్చిన విరాళాల సొమ్ము అక్రమమని దుష్ప్రచారం చేసే సాక్షి మీడియాకు, జగన్ రెడ్డి ఆస్తులు, అతని పార్టీకి వస్తున్న విరాళాలపై కథనాలు రాసే ధైర్యం ఉందా? చంద్రబాబుకి.. టీడీపీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చినట్టే సీఐడీ వైసీపీ ఆఫీసుకి.. జగన్ రెడ్డికి నోటీ సులివ్వగలదా? అంతధైర్యం సీఐడీ విభాగానికి ఉందా? దేశంలోనే అత్యంత ధన వంతుడైన సీఎంగా జగన్ రెడ్డి ఎలా నిలిచాడో సీఐడీ నిగ్గు తేల్చగలదా? పోనీ ఏ వ్యాపారాలు చేసి, ఎన్ని ఎకరాలు పండించి తాను ధనికుడైన సీఎంగా నిలిచాడో జగన్ రెడ్డి చెప్పగలడా? వైసీపీకి వస్తున్న విరాళాలు, జగన్ దేశంలోనే ధని కుడైన సీఎంగా ఎదిగిన తీరుపై ఎన్నికల కమిషన్ కూడా దృష్టిపెట్టాలి. టీడీపీ బాధ్యతగల రాజకీయ పార్టీ. అవినీతి పత్రికకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు, మాపార్టీకి లేదు. తప్పుడు కథనాలు, విషపురాతల్ని టీడీపీ లెక్కచేయదంటూ’ బొండా ఉమా ఖరాఖండీగా చెప్పారు.

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.