ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం ముమ్మాటికీ సీఎం జగన్ కక్ష్యపూరిత చర్యలే అంటున్నారు టీడీపీ శ్రేణులు. అవినీతి కేసుల్లో పదేళ్లు బెయిల్ పై బయట ఉన్న జగన్ రెడ్డి, ప్రజాసేవ తప్ప మరోటి తెలియని చంద్రబాబుని అన్యాయంగా జైలుకు దారుణం అని అన్నారు టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు. భవిష్యత్ లో జగన్ రెడ్డి అతని కేబినెట్ మొత్తం జైల్లో చిప్పకూడు తింటారు. చంద్రబాబుతో పెట్టుకొని జగన్ తప్పుచేశాడని వైసీపీ వాళ్లే అంటున్నారని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుపై జీవోలుఇచ్చిన నీలం సహానీ, నిధులు విడుదల చేసిన ప్రేమచంద్రారెడ్డిలను ఎందుకు విచారించలేదో బుర్రకథల బుగ్గన చెప్పాలి అశోక్ బాబు డిమాండ్ చేశారు.
ప్రపంచంలో ఎవరికీ దొరకని అరుదైన అవకాశం జగన్ రెడ్డికే దక్కిందని, జైల్లో ఉండా ల్సిన వ్యక్తి, బెయిల్ పై పదేళ్ల పాటు బయట ఉండటం చూస్తే న్యాయవ్యవస్థ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పని చేస్తోందనే సందేహాం ఎవరికైనా కలుగు తుందని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు అన్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రజా సేవ తప్ప, మరోటి తెలియని చంద్రబాబునాయుడిని అన్యాయంగా జైలుకు పంపి వికృతానందం పొందుతున్నాడు. చంద్రబాబుతో పెట్టుకొని జగన్ తప్పుచేశాడని వైసీపీ వాళ్లే అంటున్నారు. చట్టపరంగా న్యాయంగా జగన్ రెడ్డి చేసింది తప్పని వారే ఒప్పు కుంటున్నారు అని ఎద్దేవా చేశారు.
మంత్రి మండలి పాలసీ డెసిషన్స్ ఇలా ఉంటే, వాటిని జీవోల రూపంలో అమలు చేసేది అధికారులేనని బుగ్గనకు తెలియదా? మంత్రిమండలిలో పైనచెప్పినట్టు రెండు తీర్మానాలు అయ్యాక ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి అప్పటి విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీమతి నీలంసహానీ రెండు జీవోలు ఇచ్చారు. ఆ పని ఎందుకు చేయలేదో బుగ్గన చెప్పరు… ఇతర మంత్రులు మాట్లాడరు. ఆనాడు జీవోలు ఇచ్చిన శ్రీమతి నీలంసహానీని వైసీపీప్రభుత్వం, సీఐడీ ఒక్కసారి కూడా విచారించలేదు. ఇదే పద్ధతి భవిష్యత్ లో వచ్చే ప్రభుత్వాలు అనుసరిస్తే జగన్ రెడ్డి, అతని కేబినెట్ సభ్యులు జీవితాంతంజైల్లో ఉండక తప్పదు. ఈ విధంగా వ్యవహరించి ఈ ప్రభుత్వమే కొత్తదారి చూపిం చింది. ఇదే దారిలో రేపు టీడీపీ ప్రభుత్వం వెళ్తే ఇప్పుడున్న కేబినెట్లో ఏ ఒక్కరూ ఇంట్లో అన్నంతినలేరు. ముఖ్యమంత్రితో సహా అందరూ జైల్లో చిప్పకూడు తినాల్సిందే అన్నారు అశోక్ బాబు.
