టీచర్ పోస్ట్ ల గూర్చి కీలక వ్యాఖ్యలు చేసిన బొత్స సత్యనారాయణ…!!

Share this :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఎంతో చర్చనీయాంసంగా మారాయి.చంద్రబాబు అరెస్టు ఐనప్పటినుండి రాష్ట్రం మొత్తం అట్టుడికినట్లుంది. అదే ధోరణి ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో కూడా కనబడుతుంది. అయితే టీడీపీ ఎమ్మెల్యేలు అనవసర రాద్దాంతం చేస్తున్నారని అరెస్ట్ కి సంబంధించిన డిస్కషన్ కి రమ్మంటే రాకుండా అసెంబ్లీ లో రచ్చచేస్తున్నారని అధికార పార్టీ మంత్రి అంబటి రాంబాబు స్పీకర్ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేల మీద విరుచుకు పడ్డారు.వాళ్ళ తీరు అసలేం బాగోలేదని అన్నారు.

అయితే ఒక పక్క ఏపి శాసన మండలిలో కూడా అధికార పార్టీ మీద మరియు మంత్రుల మీద ఎమ్మెల్సీ వర్యులు టీచర్ పోస్టులకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.దాంట్లో భాగంగానే విద్యా శాఖ మంత్రి అయినా బొత్స సత్యనారాయణ గారికి ఖాళీగా ఉన్న ఎనిమిది వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయమని వాళ్ళు డిమాండ్ చేశారు. అయితే మంత్రులు దానికి ధీటుగా ఈ విషయంలో మా ప్రభుత్వం కట్టుబడి ఉందని మెరుగైన విద్యాను రాష్ట్రంలో అందించడమే మా లక్ష్యం అని ఆయన అన్నారు. అయితే అక్కడ కూడా చంద్రబాబు అరెస్టు పై వచ్చిన డిస్కషన్ లో టీడీపీ సభ్యులు ప్రవర్తనపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు అరెస్టు అలాగే ఇంకా ఏ ఇతర అంశలైనా సరే తామేప్పుడు చర్చకు సిద్ధం అని అన్నారు. దాని కోసం ఎంత సమయమైన తాము ఇస్తామని కూడా అన్నారు.అయితే మంత్రి బొత్స గారు టీచర్ పోస్టుల ప్రకటనపై ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి గారు ఆంధ్రప్రదేశ్ లో నలభై వేలకు పైగా ఖాళీగా ఉన్నాయని చెప్తుంటే మంత్రి బొత్స మాత్రం కేవలం ఎనిమిది వేల మాత్రమే ఖాళీలు ఉన్నాయని చెప్పడం సబబు కాదని చెప్పిన పోస్ట్లన్ని భర్తీ చేయాలనీ ఆయన డిమాండ్ చేసారు. ఆంధ్రప్రదేశ్ లో తొరగా మెగా డీఎస్సీని ప్రకటించాలని కూడా ఆయన సభ ముఖంగా డిమాండ్ చేశారు.