ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అంశం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు అరెస్ట్ పై వైసీపీ నేతలు తమ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. తాజాగా మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు డబ్బులు కొట్టేశాడని చెప్పడం ఆయన మిడిమిడి జ్ఞానానికి నిదర్శ నం.
తెలుగురాష్ట్రాలకు షెల్ కంపెనీలు, క్విడ్ ప్రోకో, మనీ ల్యాండరింగ్ వంటి పదాలను పరిచయం చేసింది జగన్ రెడ్డే. వోక్స్ వ్యాగన్ కంపెనీ వ్యవహారంలో వశిష్ట వాహన్ అనే ఫేక్ కంపెనీ సృష్టించి ప్రభుత్వసొమ్ము అక్షరాలా రూ.13 కోట్లు దుర్విని యోగం ఘనత బొత్స సత్యనారాయణ అన్న విషయం జగన్ కి తెలియదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నందున ఆ కేసు నుంచి ఆయన తప్పించుకోగలిగారు. నాడు ఆయనపై తీవ్రమైన ఆరోపణలు వస్తే చాలా తేలిగ్గా వాటిని కొట్టిపారేశారు. అందులో అక్యూజ్డ్ గా ఉండాల్సిన బొత్స, నాటి ప్రభుత్వ దయతో విట్ నెస్ గా ఉండి బయటపడ్డాడు.
ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసిన బొత్స నేడు చంద్రబాబుపై నిందలు వేయడం నిజంగా సిగ్గుచేటు. నేడు చంద్రబాబుకి మద్ధతుగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయంటే దానికి కారణం ఆయనపై తెలుగుప్రజలకు ఉన్న నమ్మకం. దుర్మార్గపు ఆలోచనతో అబద్ధాన్ని నిజం చేయాలని వైసీపీ ప్రభుత్వం, జగన్ రెడ్డి ఎంతగా ప్రయత్నించినా, అంతిమ విజయం ధర్మానిదే. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో అవినీతి జరిగితే దానికింద నెలకొల్పిన 40 శిక్షణా కేంద్రాల్లో పరికరాలు, సాఫ్ట్ వేర్ ఎలా వచ్చాయి? 2లక్షలకు పైగా యువత శిక్షణ ఎలా పొందారు? రాష్ట్ర పాలకులు రాజ్యాంగవ్వవస్థల్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వా మ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఈనాడు అధికారంలో ఉన్నామని అహంకారంతో విర్ర వీగే జగన్ రెడ్డి అండ్ కంపెనీ భవిష్యత్ లో చరిత్రహీనులుగా మిగిలిపోవడం ఖాయం.” అని ద్వారపు రెడ్డి జగదీశ్ స్పష్టం చేశారు.
