MP Raghu Rama Krishna Raju petition in High Court: 11 చార్జీ షీట్లలో నిందితుడైన వ్యక్తి సీఎం సీటుకు అర్హుడు.. కోర్టులో పిల్ వేయడానికి మాత్రం నేను అర్హుడినికానా?

కోర్టులో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అడిగే వారు లేరనుకుంటున్నారా?

MP Raghu Rama Krishna Raju petition in High Court MP Raghu Rama Krishna Raju petition in High Court
Share this :

MP Raghu Rama Krishna Raju petition in High Court నరసాపురం, నవంబర్‌ 23: ఆర్థిక నేరాభియోగ కేసుల్లో రూ.43 వేల కోట్లు కొట్టేశాడని సీబీఐ 11 చార్జిషీట్లు దాఖలు చేయగా, కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తి సీఎం పదవికి అర్హుడు. కానీ.. సీబీఐ, సీఐడీ కేసు విచారణ జరుగుతోందని చెప్పి న్యాయస్థానం (AP High Court)లో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేయడానికి మాత్రం నేను (MP Raghu Rama Krishna Raju petition in High Court) అనర్హుడనని రాష్ట్ర (Andhra Pradesh)ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ అనడం హాస్యాస్పదంగా ఉందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Raghu Rama Krishna Raju) మండిపడ్డారు. గురువారం ఆయన రచ్చబండ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ… ‘వైసీపీ (YSRCP) ఎంపీనని చెప్పి నేను తప్పుడు ధృవీకరణ ఇచ్చారని అడ్వకేట్ జనరల్ పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. నన్ను ఇంకా పార్టీ నుంచి బహిష్కరించలేదన్న విషయాన్ని అడ్వకేట్ జనరల్ గుర్తించాలని రఘురామ సూచించారు. సీఎం జగన్‌కు (AP CM Jagan) చెప్పి నన్ను పార్టీ నుంచి బహిష్కరించమని సలహా ఇవ్వాలంటూ ఆయన అడ్వకేట్ జనరల్‌కు చెప్పారు.

అప్పుడు నేను వైసీపీ ఎంపీని కాదని, సాధారణ ఎంపీనని గుర్తించాలని పేర్కొంటూ ధ్రువీకరణ పత్రాన్ని మార్చి, కోర్టుకు సమర్పిస్తానన్నారు. మూడున్నర ఏళ్ల క్రితం షెడ్యూల్ 10 ప్రకారం నాపై వైసీపీ నేతలు అనర్హత పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌కు అప్పుడే సమాధానం చెప్పాను. గతంలో సీనియర్ పార్లమెంటేరియన్ శరద్ యాదవ్‌ను అనర్హుడిగా ప్రకటించినట్లుగా, నన్ను కూడా అనర్హుడిగా ప్రకటించారని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ అనుకుంటున్నారేమోనని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ తన పదవిని అడ్డం పెట్టుకుని తన సొంత కంపెనీలకు, అనుయాయులకు ఎలా లబ్ధి చేకూరుస్తున్నారు సవివరంగా వివరిస్తూ 1340 పేజీలతో కూడిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని రాష్ట్ర హైకోర్టులో దాఖలు చేశాను.

చదవండి:Kukatpally Janasena: ‘కూకట్‌పల్లి కమ్మలు కలిసి రండి.. కలిసి గెలుద్దాం!..’ యాళ్ల వరప్రసాద్‌

ఆ పిటిషన్ కోర్టు నెంబర్ మూడులో గురువారం నాడు విచారణకు చేపట్టారు. పిటిషనర్‌గా నా తరపున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ రావు వాదనలు వినిపించగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ముందు తన వాదనలు వినాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసిన వ్యక్తి గురించి ఒకసారి పరిశీలించాలని కోర్టును అడ్వకేట్ జనరల్ కోరారు. పిటీషన్‌లో వైసీపీ ఎంపీనని నేను పేర్కొనడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ… మూడున్నర ఏళ్ల క్రితమే ఆయనపై అనర్హత పిటిషన్ దాఖలు చేశామన్నారు. రెస్పాండెంట్ తరపున కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున తాను వాదనలను వినిపిస్తున్నానని చెప్పిన అడ్వకేట్ జనరల్, నాపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్ ప్రస్తావించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. జగన్‌ తరఫున వాదనలు వినిపించకపోతే నేను వైసీపీ సభ్యుడిని కాదని ఫైల్ చేసిన పిటిషన్ కు, అడ్వకేట్ జనరల్ కు సంబంధం ఏమిటంటూ నిడదీశారు. కోర్టులో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అడిగే వారు లేరని అనుకుంటున్నారా? అంటూ ఫైర్ అయ్యారు.

ఆర్థిక నేరాభియోగ కేసుల్లో సీబీఐ 11 ఛార్జ్ షీట్లను దాఖలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగవచ్చు కానీ ఒక ఎంపీగా నేను ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేయవద్దని అంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేయడానికి పొందుపరిచిన నిబంధనలను అడ్వకేట్ జనరల్ చదివి వినిపించారు. అయితే అందులోని మ్యాటర్, సీరియస్ గ్రీవెన్స్ ను పరిగణలోకి తీసుకోవాలన్న విషయాన్ని ఆయన విస్మరించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని అడ్మిట్ చేయవద్దన్న అడ్వకేట్ జనరల్ అభ్యర్థన పై న్యాయమూర్తి స్పందిస్తూ… ఈ కేసులోని ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం స్వీకరణ పై ఒక నిర్ణయం తీసుకుంటామని, ఈ కేసును డిసెంబర్ 13వ తేదీకి వాయిదా వేశారని ఎంపీ రఘురామ వెల్లడించారు. ఒకవేళ వైసీపీ పార్టీ నుంచి నన్ను బహిష్కరిస్తే, సాధారణ ఎంపీగా నన్ను గుర్తించాలని కోరుతూ అమైన్మెంట్ సబ్మిట్ చేస్తానని తెలిపారు.

చదవండి: Social Media Stars in Politics: రాజకీయ పార్టీలకు తలనొప్పిగా మారిన సోషల్ మీడియా స్టార్లు

ఈ కేసులో సీఎం జగన్‌తో పాటు ప్రతి వాదులైన అందరికీ నోటీసులు అందుతాయన్నారు. సాక్షి దినపత్రికను ఎలా విక్రయిస్తున్నారో, సిమెంటు పోర్టల్ ద్వారా తన సొంత కంపెనీకి, అనుయాయుల కంపెనీలకు ఎలా లబ్ధి చేకూరుస్తున్నారో త్వరలోనే తేలనుందని అన్నారు. సీఎం జగన్‌పై తనకు వ్యక్తిగత ద్వేషం లేదని, రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని చూసే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశానన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ భావిస్తున్నట్లుగా నాకు ముఖ్యమంత్రిపై వ్యక్తిగత కక్ష లేదు. నన్ను లాకప్‌లో చిత్రహింసలు పెట్టారనో.. హత్య చేయాలని చూశాడనో కాదు… నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి, ప్రజలే నన్ను కాపాడుకుంటారు. ప్రతి వ్యక్తికి మరణాన్ని దేవుడు ముందే లిఖిస్తాడు. ఆ మరణాన్ని పోస్ట్ పోన్ చేయడం ఫ్రీ పోన్ చేయడం ఎవరి తరం కాదు. రాజ్యాంగబద్ధమైన పదవిలో అడ్వకేట్ జనరల్ ఉండగా, ప్రజల చేత ఎన్నుకున్న ప్రజా ప్రతినిధిగా నేను ఉన్నాను. ఎవరి హక్కులు, అధికారాలు వారికి ఉంటాయి. ఎవరికి ఎవరు తక్కువేమీ కాదు. ప్రభుత్వం పేరిట వాదిస్తున్నానని చెప్పి , వ్యక్తిత్వ హననానికి పాల్పడే ముందు అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడాలని రఘురామ హితవు పలికారు .

పోలీస్ విధివిధానాలు తెలియజేయాలని డీజీపీకి లేఖ రాస్తా

పోలీసుల విధి విధానాలపై ఆయన మాట్లాడుతూ.. పోలీస్ విధివిధానాలు తెలియజేయాలని కోరుతూ రాష్ట్ర డీజీపీకి లేఖ రాస్తానన్నారు. టెర్రరిస్టులను మినహాయించి ఎవరినైనాపోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో విధిగా యూనిఫామ్ ధరించాలని, ఐడి కార్డు ప్రదర్శించాలని, ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవిని ఎలా చిత్రహింసలకు గురిచేశారో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఏబీఎన్ ఛానల్‌కు వివరించారు. బీటెక్ రవిని అదుపులోకి తీసుకున్న సమయంలో పోలీసు తమ ప్రవర్తన నియమావళికి పూర్తి భిన్నంగా వ్యవహరించారన్నారు. గతంలో నన్ను కూడా ఇలాగే అదుపులోకి తీసుకోవాలని ఇంటలిజెన్స్ ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి అనే వ్యక్తిని మఫ్టీలో నా ఇంటికి కాపలా పెట్టారు. అనుకోకుండా ఒక వ్యక్తికి అతను రఘురామకృష్ణం రాజును అదుపులోకి తీసుకోనున్నారని చెప్పడంతో నేను అప్రమత్తమయ్యాను.

రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి నా ఇంటి ముందు ఎందుకు పెట్టారో చెప్పాలని పోలీసులను కోరగా, నా ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు రక్షణ కోసం ఆయన్ని కాపలాగా పెట్టామని చెప్పారన్నారు. పోలీసుల తరహాలో దొంగ పోలీసులు వచ్చి నన్ను అపహరించి, మార్గం మధ్యలోనే కడతేర్చాలన్నది కొంతమంది ప్లాన్. ఇప్పుడు బీటెక్ రవి విషయంలోనూ అదే పథకాన్ని అమలు చేశారు. కాకపోతే బీటెక్ రవి భార్య అప్రమత్తంగా వ్యవహరించడంతో ఆయనకు ముప్పు తప్పింది. గత్యంతరం లేని పరిస్థితిలో పది నెలల క్రితం నమోదు చేసిన కేసులో అరెస్టు చేశామని చెప్పి మేజిస్ట్రేట్ ముందు ఆయన్నిహాజరు పరిచారు. రాజకీయ నాయకులను, జర్నలిస్టులను అరెస్టు చేయాలంటే కచ్చితంగా పోలీసులు యూనిఫామ్ లోనే వెళ్లి వారికి నోటీసులు సర్వ్ చేసిన తర్వాతే అదుపులోకి తీసుకోవాలని, ఆ విషయంపై రాష్ట్ర డీజీపీకి నేను లేఖ రాస్తానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.