ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాబోయే రాజ్యసభ ఎన్నికల చుట్టూ అత్యంత ఆసక్తికరమైన చర్చ మొదలైంది. కూటమి ఒప్పందంలో భాగంగా రాబోయే రాజ్యసభ స్థానాల్లో ఒకదానిని జనసేన పార్టీ దక్కించుకుంటుందని అంతా భావించారు. అయితే, తాజా పొలిటికల్ సమీకరణాల ప్రకారం.. ఈ సీటును జనసేన వదులుకునే యోచనలో ఉన్నట్లు అమరావతి వర్గాల్లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా తీసుకుంటున్న ఈ నిర్ణయం వెనుక పెద్ద పొలిటికల్ స్కెచ్ ఉందనే ప్రచారం సాగుతోంది.
Also Read: హార్దిక్ పాండ్యా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్.. కొన్ని గంటల్లోనే రీ-ఎంట్రీ..!
రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం.. తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైన, మరియు గత ఎన్నికల సమయంలో పార్టీ కోసం ఆర్థికంగా, వ్యూహాత్మకంగా అండగా నిలిచిన ఒక సీనియర్ నేతకు రాజ్యసభకు పంపాలని సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారట. కూటమి ధర్మం ప్రకారం జనసేనకు ఇవ్వాల్సిన సీటును.. సదరు టీడీపీ కీలక నేత ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, చంద్రబాబు అభ్యర్థన మేరకు పవన్ కళ్యాణ్ ఈ త్యాగానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనికి బదులుగా భవిష్యత్తులో రాబోయే ఇతర కీలక పదవుల్లో లేదా నామినేటెడ్ కోటాల్లో జనసేనకు తగిన ప్రాధాన్యత ఇస్తామని టీడీపీ అగ్రనాయకత్వం భరోసా ఇచ్చినట్లు టాక్.
Also Read: Tollywood: సినీ ఇండస్ట్రీలో రచ్చ ముగిసినట్లేనా..?
