Kiran Royal: రోజా, అమర్నాథ్ లపై కిరణ్ రాయల్ ఫైర్!

Share this :

ఏపీలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్దం నడుస్తుంది. సమయం దొరికితే చాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అధికార పక్షనేతలు మాటల దాడి చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి జనసేన నేతలు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. గత కొంత కాలంగా మంత్రి అమర్నాథ్.. జనసేన నేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. శనివారం ప్రెస్ క్లబ్ లో జనసేన పార్టీ తిరుపతి ఇంఛార్జి కిరణ్ రాయల్… మంత్రులు రోజా, అమర్నాథ్ లపై ఫైర్ అయ్యారు.

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే అమర్నాథ్ కి ఎలా బుద్ది చెప్పాలో తమకు బాగా తెలుసు అని అన్నారు. త్రి అమరనాధ్ కి తక్కవ వయస్సు ఉండి *యాగ్రా పనిచేయడం లేదని తెలిసి ఆయుర్వేదిక్ మూలికలు పంపుతున్నామన్నారు. ఇంకోసారి పవన్ కల్యాణ్ గురించి మాట్లాడితే కొరియర్ లో సుఖవంతమైమ జీవితం కోసం మీ ఇంటికి మూలికలు పంపుతామని అన్నారు. మంత్రి రోజా తనకు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంది. మహిళ అయి ఉండి కూడా తోటి మహిళలపై కామెంట్స్ చేస్తుంది. మంత్రి రోజాపై ఎలాంటి జాలి లేదు కనుకనే.. ఆమో తోటి మంత్రులు విడదల రజని, తానేటి వనిత, పసుపులేటి ఉషా చరణ్ లే స్పందించలేదు, రోజా గురించి తెలియక రాధిక శరత్ కుమార్, కుష్బు లు మద్దతు ప్రకటించారు. అసలు విషయం తెలిస్తే పరిస్థితి వేరేలా ఉండేది. 

గతంలో రజనీకాంత్ ను, చంద్రబాబు, చిరంజీవి కుటుంబాలను రోజా ఎలా బూతులు తిట్టిందో వారికి తెలియదని.. రోజా నోటికొచ్చినట్లు చాలా మందిని తిట్టిందని, ఆమెను మాత్రం ఒకమాట అంటే డ్రామాలు వేస్తుందని, అమె తిట్టిన బూతులు, చేసినా చేష్టలు రాధిక, కుష్బు లు చూస్తే నగరికి వెళ్ళి మరి రోజాకి సరైన బుద్ది చెబుతారని అన్నారు. ఆ పార్టీలోని మహిళ మంత్రులకు, కార్యకర్తలు ఇక్కడ ఉండే హీరోయిన్లు రోజా గురించి తెలిసి స్పందించలేదని, మీరెందుకు స్పందించారో మాకు అర్ధం కావడం లేదని కిరణ్ రాయల్ అన్నారు. రోజా మీకు ఫొన్ చేసి దోంగ ఏడుపులు ఏడ్చి సానుభూతి పొందుతుందని, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మహిళ రోజా అని వారు మండిపడ్డారు.

అధికార పార్టీకి ఆరు నెలలే కాల వ్యవధి అని, నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న రోజా, అమరనాధ్, కొడాలి నాని, అంబటి రాంబాబు, జోగి రమేష్, ద్వారంపూడి చంద్రశేఖర్, పేర్ని నాని, అనిల్ కుమార్ లు త్వరలోనే జవాబు చెప్పే రోజు వస్తుందని, రేపు మీరు ఓడిపోతే మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకోవాలని జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, కొండరాజు మోహన్, హేమ కుమార్, రాజేష్ ఆచారి, కిషోర్, హిమవంత్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.