Anchor Roshan Political Entry: పాలిటిక్స్‌లోకి యాంకర్‌ రోషన్‌ ఎంట్రీ ? అసలు సంగతి ఇదే

ఢిల్లీ కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి పిలుపు అందుకేనా..

Share this :

Anchor Roshan Political Entry: యాంకర్‌ రోషన్‌ (Anchor Roshan) తెలియని వారుండరు. తనదైన శైలిలో రకరకాల వ్యక్తులను ఇంటర్వ్యూ చేస్తూ అలరిస్తున్న ఈ యాంకర్‌ త్వరలో రాజకీయాల్లోకి ఎంట్రీ (Political Entry) ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పలు పార్టీలకు చెందిన నేతను వరుసగా యాంకర్ రోషన్‌తో మాట్లాడేందుకు పిలిపించుకోవడమే అందుకు కారణం. తాజాగా జాతీయ కాంగ్రెస్‌ (Congress) అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే (Mallikarjun Kharge)తో భేటీ అయ్యాడు. కాంగ్రెస్‌ నాయకులే రోషన్‌ను ఢిల్లీకి పిలిపించుకుని మరీ ఖర్గేతో మాటలు కలిపించారు. దీంతో రాజకీయ నేతలకు రోషన్‌తో పనేంటి ? అనే చర్చ సర్వత్రా మొదలైంది.

Also Read: Tharpanas at Tirupati: తర్పణ విధిలో జాతీయ స్ఫూర్తి..

ఇక యాంకర్‌గా రోషన్‌కు ఉన్న పాపులారిటీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోషన్‌ వీడియోలు యూట్యూబ్‌ (Youtube)లో క్షణాల్లో వైరల్‌ అవుతుంటాయి. రోషన్‌ చేసిన ఇంటర్వ్యూలకు మిలియన్లలో వ్యూస్‌ రావడమే అందుకు కారణం. మెగాస్టార్ చిరంజీవి నుంచి నిర్మాత దిల్‌ రాజు వరకు ఎందరినో హీరోలను, హీరోయిన్లను, విలన్‌ పాత్రలు చేసిన వారిని, కమెడియన్లను ఇంటర్వ్యూ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల వేళ రాజకీయ నేతలు రోషన్‌ను కలిసేందుకు పిలిపించుకోవడం ఆసక్తిగా మారింది. భారాస నేత కేటీఆర్‌, నారా లోకేష్‌, ఇటీవల ఖర్గే తో ఆయన దిగిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Also Read: TS DSC 2023 Postponed: తెలంగాణ డీఎస్సీ పరీక్ష వాయిదా.. కారణం ఇదే!

చూసేందుకు హీరో మెటీరియల్‌గా కనిపించే రోషన్‌ సినీ హీరోగా సెటిలవుతాడనుకుంటే ఏకంగా పొలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చేలా ఉన్నాడంటూ సోషల్‌ మీడియా (Social Media)లో సరికొత్త చర్చకు దారితీసింది. కాంగ్రెస్ అగ్రనేత మల్లికార్జున ఖర్గే నుంచి పిలుపురావడంతో యాంకర్‌ రోషన్‌ పొలిటికల్‌ ఎంట్రీ ఎప్పుడంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 2024 లోనా 2029 ఎన్నికల్లోనా? అన్నది ఆసక్తికరంగా మారింది. అన్ని రాజకీయ పార్టీల నేతలతో ఆయనకున్న పరిచయాలు దృష్ట్యా ఏ పార్టీలోకి ఎంట్రీ ఇస్తారు? ఎవరు టికెట్‌ ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది. టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ (Nara Lokesh)తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: Election Code in Telangana: ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు.. మాకెందీ రభస?’