తిరుపతి, అక్టోబర్ 17: మహాలయ అమావాస్య (Mahalaya Amavasya) సందర్భంగా మనల్ని విడిచి వెళ్ళిన వారికి తర్పణాలు (tharpanas) ఇవ్వడం మన సంప్రదాయం. ఈ సందర్భంగా సంస్కార ఫౌండేషన్ (Sanskara Foundation) ఆధ్వర్యంలో వినూత్నంగా దేశానికి ఎనలేని సేవలు అందించిన ప్రముఖులు వారికి వారసులు లేకపోవడం వలన ఫౌండేషన్ సభ్యులే తిరుపతి (Tirupati)లో తర్పణ విధి నిర్వహించారు. శాస్త్రవేత్త రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం (APJ Abdul Kalam), మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి, టంగుటూరి ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాముల (Potti Sriramulu) వంటి మహనీయులకు ఫౌండేషన్ సభ్యులు తర్పణలు శాస్త్రీయంగా నిర్వహించారు.
కుల మతాలు ఆతీతంగా దేశానికి సేవలు అందించిన ముద్దు బిడ్డలు వీరు.. వీరి కోసం మన సంప్రదాయాలు అనుసరించి చేయాల్సిన బాధ్యత గుర్తించి చేశాం అని ఫౌండేషన్ ఛైర్మన్ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజేష్, అన్నిల్ అన్నదానం, చంద్రమోహన్ రావు, ప్రసాద్, కంచి హేమాద్రి, పవన్ అంగర తదితరులు పాల్గొన్నారు.
Also Read: Election Code in Telangana: ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు.. మాకెందీ రబస?’

Comments are closed.