Election Code in Telangana: ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు.. మాకెందీ రభస?’

తెలంగాణలో ఎన్నికల కోడ్ వీళ్ల వ్యాపారానికి తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టింది

Share this :

హైదరాబాద్‌, అక్టోబర్‌ 17: ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు.. ఎన్నికలవేళ (Telangana Assembly elections) అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ కొందరి వ్యాపారాలకు ఎసరు తెచ్చింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ (Election Code) అమలులోకి వచ్చినప్పటి నుంచి సరైన పత్రాలు (proper proof of ownership and relevant documents)చూపించకుండా రూ.50 వేలకు మించిన నగదు, బంగారం, వెండి, మద్యం (cash, gold, silver) వంటి వాటిని రవాణా చేస్తే పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మద్యం వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోట్లు పెట్టి వ్యాపారం చేసి రోజంతా కష్టపడిన ఏం ఫలితం లేకుండా పోతుందని బాధపడుతూ మద్యం విక్రేతలు (Liquor Retailers) తెలంగాణ ఎన్నికల అధికారులను కలిసి తమ గోడు విన్నవించుకున్నారు .

Also Read: Seemandhra Kamma Support to Congress: సీమాంధ్ర కమ్మల చూపు.. రేవంత్‌ రెడ్డి వైపు..

ఎన్నికల కోడ్ అమలవుతున్నప్పటి నుంచి తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఫిర్యాదు చేయడానికి ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజు (Telangana Chief Electoral Officer Vikas Raj)వద్దు వచ్చి వినతి పత్రాలు సమర్పించారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా డబ్బు, మద్యం సరఫరా చేయకుండా ఉండేందుకు చెక్‌పోస్టుల వద్ద లెక్కపత్రం లేని డబ్బు, మద్యంను పోలీసులు పట్టుకొని సీజ్ చేస్తున్నారు. అయితే అక్రమంగా తరలించే వారిని పట్టుకోవాలని సక్రమంగా కోట్లు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసే తమను ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు? అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైన్స్ షాపులు నిర్వహించే యజమానులు గగ్గోలు పెడుతున్నారు.

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇబ్బంది తలెత్తుతోందని, 12వ తేదీ నుంచి ఇప్పటి వరకు 56 వైన్ షాపులు (Wine Shops) సీజ్ చేసారని వాపోయారు. కోట్ల రూపాయల పెట్టి వ్యాపారం చేసే వాళ్లను పోలీసులు దొంగల్లాగా చూస్తున్నారని, మఫ్టీలో వచ్చిమరీ షాపుల యజమానులను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని సీఈఓ (CEO)కు ఫిర్యాదు చేసారు. రోజంతా కష్టపడి అమ్మిన సరుకు దానికి సంబంధించిన డబ్బును రాత్రి ఇంటికి తీసుకెళ్తున్న సమయంలో అక్రమంగా డబ్బు తరలిస్తున్నారంటూ మా వద్ద నుంనచి డబ్బు తీసుకుని సీజ్‌ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నౌకరి నామ , షాప్ లైసెన్స్ చూపించిన వదలట్లేదని సీఈఓ ముందు తమ బాధను వెల్లగక్కారు. ఇదే విధంగా తమను ఇబ్బంది పెడితే రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్ షాపులను మూసి వేయాల్సి వస్తుందని వైన్ షాపుల యజమానులు హెచ్చరించారు.

Also Read: TS DSC 2023 Postponed: తెలంగాణ డీఎస్సీ పరీక్ష వాయిదా.. కారణం ఇదే!

5 రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా..

కాగా ఇటీవల తెలంగాణతోపాటు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘఢ్‌, మిజోరాం (Telangana, Rajasthan, Madhya Pradesh, Chhattisgarh, Mizoram).. ఈ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్‌ (Election Commission of India) పోలీంగ్ తేదీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో ఖాఖీలు చెక్‌పోస్టుల (police checking at Checkposts) ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఈ నెల 9 నుంచి ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. నాలుగు రాష్ట్రాల సరిహద్దులున్న తెలంగాణలో దాదాపు 148 చెక్‌పోస్టులు ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి అక్రమ మద్యం డబ్బు పంపిణీలను నిలిపే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read: Fact Check: టీవీ9 రజనీకాంత్‌పై నెట్టింట ట్రోలింగ్‌.. ‘దిస్ ఇజ్‌ నాట్ వాస్తవం’

దీంతో పలు చెక్‌ పోస్టుల (Check Posts) వద్ద పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు, మద్యం పట్టుబడుతోంది. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడినప్పటి నుంచి పోలీసుల తనిఖీల్లో లెక్కా పత్రం లేకుండా తీసుకెళ్తున్న కోట్ల రూపాయల నగదు దొరుకుతున్నాయి. కేజీల కొద్ది బంగారం, వెండి కూడా పోలీసుల చేతికి చిక్కుతున్నాయి. ఇప్పటి వరకూ దాదాపు రూ.74.95 కోట్ల విలువ చేసే నగదు, మద్యం, గోల్డ్ పట్టుకున్నారు. ఇందులో రూ.48.32 కోట్ల నగదు ఉండగా.. రూ.4.72 కోట్ల విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రాత్రి రూ.4.3 లక్షల నగదు సూర్యపేట్‌ చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసులు సీజ్‌ చేశారు. గడచిన 24 గంటల్లో ఒక్క నల్గొండ జిల్లాలోనే సరైన సత్రాలు లేకుండా రవాణా చేస్తున్న రూ.6.1 లక్షల నగదును పోలీసులు సీజ్‌ చేశారు.