హైదరాబాద్, అక్టోబర్ 18: తెలంగాణలో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు (Telangana Assembly Poll Schedule) రాజకీయ పార్టీలు (Political Parties) ముమ్మర ప్రచారాలు చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి తాయిలాలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఎన్నికలు పారదర్శంగా జరగాలని ఎన్నికల కమిషన్ (Election Commission of India) ఎన్ని ప్రయత్నాలు చేసినా అడ్డదారులు తొక్కేవారు ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు. ఎన్నికల కోడ్ (Election Code in Telangana) వచ్చినప్పటి నుంచి మంగళవారం (అక్టోబర్ 17) నాటికి మొత్తం 9 రోజుల వ్యవధిలోనే లెక్కాపత్రం లేకుండా (inducement free) పట్టుబడ్డ మద్యం, బంగారం, నగదు విలువ అక్షరాల రూ.130 కోట్లు దాటింది.
Also Read: Election Code in Telangana: ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు.. మాకెందీ రభస?’
కోట్లు విలువ చేసే మద్యం, మత్తుపదార్ధాలు
సోమవారం ఒక్కరోజు సీజ్ చేసిన నగదు రూ.12,58,59,177. అక్టోబర్ 9 నుంచి బుధవారం వరకు పోలీసులు సీజ్ చేసిన నగదు రూ. 71,55,58,094. సోమవారం ఒక్కరోజు పట్టుబడిన మద్యం (Seizure of liquor) విలువ రూ.1,10,98,610. వీటిల్లో మద్యం 7998 లీటర్లు, 625 కిలోల నల్ల బెల్లం, 4 కిలోల ఆలం పట్టుబడ్డాయి. అక్టోబర్ 9 నుంచి సోమవారం వరకు పట్టుబడిన మద్యం (Liquor) విలువ రూ.7,75,79,917గా పోలీసులు తేల్చారు. ఇందులో 52,091 లీటర్ల మద్యం, 1280 కిలోల నల్ల బెల్లం, 530 కిలోల ఆలం పట్టుబడింది. ఇక మత్తు పదార్థాలు కూడా పెద్ద ఎత్తున పట్టుబడ్డాయి. సోమవారం ఒక్కరోజు రూ.1,60,43,125 విలువ కలిగిన మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. 560 కిలోల గంజాయిని పోలీసుల తనిఖీల్లో బయటపడింది. ఇక అక్టోబర్ 9 నుంచి మంగళవారం (అక్టోబర్ 17) వరకు రూ. 4,58,04,720 విలువ కలిగిన 1694 కిలోల గంజాయి పట్టుబడింది.
Also Read: TS DSC 2023 Postponed: తెలంగాణ డీఎస్సీ పరీక్ష వాయిదా.. కారణం ఇదే!
పట్టుబడిన బంగారం, వెండి ఆభరణాలు
అక్టోబర్ 16 ఒక్కరోజు రూ. 4,93,88,430 విలువ కలిగిన 8.110 కిలోల బంగారం, 29.08 కిలోల వెండి పట్టుబడింది. అక్టోబరు 9 నుంచి పట్టుబడిన వాటి విలువ రూ. 40,08,44,300గా పోలీసులు తెలిపారు. అందులో 72.267 కిలోల బంగారం, 429.107 కిలోల వెండి, 42.203 క్యారట్ల వజ్రాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే రూ. 1,61,02,900 విలువ కలిగిన 3900 కిలోల బియ్యంతోపాటు ఇతర నిత్యవసర వస్తువులు పట్టుబడ్డాయి. అక్టోబర్ 9 నుంచి ఇప్పటి వరకు రూ.6,29,04,500 విలువ కలిగిన బియ్యం, చీరలు, కుక్కర్లు.. ఇతర ఉచిత వస్తువులను సీజ్ చేశారు. వాటిల్లో 43,700 కిలోల బియ్యం, 627 చీరలు, 80 కుట్టు యంత్రాలు, 87 కుక్కర్లు వగైరా ఉన్నాయి. ఆ లెక్కన ఇప్పటి వరకు సీజ్ చేసిన మొత్తం విలువ రూ. 130,26,91,531 ఉన్నట్లు (TS Poll Related Seizures Mount) పోలీసధికారులు మీడియాకు వెల్లడించారు. కాగా తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు (Telangana State Assembly polls) జరననున్న సంగతి తెలిసిందే.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.

2 Comments
Comments are closed.