Actress Shruti Haasan in Politics: రాజకీయాల్లోకి స్టార్‌ హీరోయిన్ ఎంట్రీ? మరోసారి క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

రాజకీయాల్లోకి రావాలంటూ ఫ్యాన్స్ అడగడం వెనుక అసలు కారణం అదేనా?

Share this :

Actress Shruti Haasan Political Entry News: దక్షిణాది క్రేజీ హీరోయిన్లలో శృతి హాసన్ ఒకరు.‌ విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ (Kamal hasan daughter) కుమార్తె అయినప్పటికీ తండ్రి పలుకుబడిని ఎక్కడా వినియోగించకుండా సొంతకాళ్లపై నిలబడి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది శృతిహాసన్ (Shruti Haasan). ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస షూటింగ్‌లతో బిజీగా ఉంది. శృతి హాసన్‌ నటిగా మాత్రమే కాకుండా సంగీత దర్శకురాలు, గాయనిగా కూడా ఫేమ్ తెచ్చుకుంది. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టే ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియా (Social Media)లోనూ యాక్టివ్‌గా ఉంటుంది.

Also Read: TS Assembly Polls 2024: తెలంగాణ తనిఖీల్లో భారీగా పట్టుబడ్డ నగదు.. రూ.130 కోట్లు దాటిన లెక్కపత్రంలేని సొమ్ము

అయితే గత కొంతకాలంగా ఈ బ్యూటీ తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లోకి ఎంట్రీ (Political Entry) ఇస్తుందంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. ఆమె కోలీవుడ్ స్టార్ నటుడు, మక్కల్‌ ఇయక్కం పార్టీ (Makkal Needhi Maiam) అధ్యక్షుడు కమలహాసన్‌ కుమార్తె కావడమే అందుకు ప్రధాన కారణం. దీంతో తండ్రి బాటలో శృతి హాసన్‌ కూడా రాజకీయ రంగప్రవేశం చేస్తుందా? అనే విషయంపై తరచూ నెట్టింట ఫ్యాన్స్‌ అడుగుతున్నారు. దీనిపై నటి ఇప్పటికే ఎన్నోసార్లు క్లారిటీ ఇస్తూనే వచ్చింది. తాజాగా కోయంబత్తూర్‌లో మీడియాతో ముచ్చటిస్తున్న ఈ సందర్భంగా శ్రుతిహాసన్‌కు మళ్లీ అదే ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతానికి రాజకీయాల్లోకి రావడానికి పెద్దగా ఆసక్తి లేదని.. తన దృష్టి మొత్తం సినిమాల్లో నటించడంపైనే ఉందంటూ చెప్పొకొచ్చింది.

 

Also Read: Election Code in Telangana: ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు.. మాకెందీ రభస?’

ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ యమ బిజీగా ఉంది. త్వరలో విడుదలకానున్న పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) నటించిన ‘సలార్‌’ (Salaar) మువీలో కనపించనుంది. ఈ ఏడాది హాలీవుడ్‌లోకి కూడా శృతి హాసన్‌ ఎంట్రీ ఇవ్వనుంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రమని, అందులో తాను కూడా నటించబోతున్నట్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. అయితే తాను తమిళ అమ్మాయినని, ఎక్కువగా తమిళ చిత్రాల్లో నటించడానికే ఇష్టడతానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.