MP Raghu Rama Krishna Raju Rachabanda నరసాపురం, నవంబర్ 15: సీఎం జగన్ (CM Jagan) హెలికాప్టర్ (Helicopter)లో తిరగడం మాని, రోడ్లపై ప్రయాణం చేస్తే.. గతుకులమయమైన రోడ్లతో ప్రజలు పడుతున్న అవస్థలు ఆయనకు కూడా తెలుస్తాయని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు (MP Raghu Rama Krishna Raju) అన్నారు. ‘రాష్ట్రం (Andhra Pradesh)లో రహదారులన్నీ అధ్వానంగా ఉన్నాయి. ఉభయగోదావరి జిల్లాలతో పాటు, కృష్ణా, గుంటూరు జిల్లాలోనూ రోడ్లన్నీ (Roads) గతుకుల మయంగా మారాయి. పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లడానికి పట్టే సమయం నాలుగు నుంచి ఐదు రెట్లు పెరిగిందని’ ఆయన అన్నారు. మంగళవారం నిర్వహించిన రచ్చబండ (RRR Rachabanda) కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ…
‘జగనన్న (AP CM YS Jagan) రాజ్యంలో ప్రజలు చాలా దరిద్రాన్ని, దుర్భిక్షాన్ని అనుభవిస్తున్నారని అన్నారు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లడానికి పట్టే సమయం నాలుగు నుంచి ఐదు రెట్లు పెరిగితే, అదనంగా ఖర్చయ్యే పెట్రోల్, డీజిల్ భారాన్ని వాహనదారులు మోయలేక పోతున్నారన్నారు. జగనన్న మద్యం దెబ్బకు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వైద్యులు (Gastroenterologist doctors) బాగుపడుతున్నారని నేను సోమవారం నాటి రచ్చబండ కార్యక్రమంలో చెబితే, ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి… కేవలం గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ వైద్యులు మాత్రమే కాదు.. ఇంకా కొన్ని రంగాలకు చెందిన వారు కూడా చాలా సంతోషంగా ఉన్నారని ఆయన చెప్పాడు. ఆటోమొబైల్ మెకానికులు కూడా జగనన్న రాజ్యంలో సుఖంగానే ఉన్నారని’ విమర్శించారు.
పగులుతోన్న టైర్లు.. విరుగుతోన్న నడుములు
గతంలో చిన్న ఇల్లు ఉన్నవారు ఇప్పుడు డాబా కట్టుకుంటే, డాబా ఉన్నవారు అదనంగా మరొక అంతస్తును వేసుకున్నారన్నారు. జగనన్నే అధికారంలో ఉండాలని, జగనన్నే మళ్లీ అధికారంలోకి రావాలని ఆటోమొబైల్ మెకానికులు కోరుకుంటున్నట్లు తెలిసిందన్నారు. గతుకుల మయమైన రోడ్లలో గోతుల్లో పడి వాహనాలు చాలా దారుణంగా డ్యామేజ్ అవుతున్నాయి. అలాగే ఉభయగోదావరి జిల్లాలలో ఫిష్ ఫీడ్ తీసుకువచ్చే లారీలకు కూడా కమాన్ కట్టలు విరిగిపోతున్నాయి. రోడ్లు ఇలాగే ఉండాలని ఆటోమొబైల్ మెకానికులు (mechanics) కోరుకుంటున్నారు. నా మిత్రుడు ఒకరు లెక్సస్ అనే ఖరీదైన వాహనాన్ని 80 లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశాడు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వలస వెళ్లి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా సాగడంతో, సొంత ఊరుకు తన ఖరీదైన కారుకు వెళ్ళాడు. సొంత ఊరుకు వెళ్తుంటే గతుకులమయమైన రోడ్డుతో తన ఖరీదైన వాహనం టైర్ పగిలింది .
ఆవాహనం టైర్ పగిలే అవకాశం లేదని, ఉత్పత్తిదారులు స్టెప్నీ టైర్ కూడా ఇవ్వలేదు. దీనితో చేసేది లేక తన వాహనాన్ని లారీలో హైదరాబాదుకు తెప్పించుకున్నాడు. టైర్ ఎలా పగిలిందో తెలియక ఉత్పత్తిదారులు తికమక పడి తల బద్దలు కొట్టుకున్నారట. చివరకు ఉచితంగానే టైర్‌ను అందజేసినట్లు తెలిసింది.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో టైర్లు గతుకులమయమైన రోడ్లలో పడి పగిలిపోతున్నాయి. జగన్ రాజ్యంలో టైర్ల ఉత్పత్తిదారులు కూడా బాగానే బతుకుతున్నారంటూ ఎద్దేవా చేశారు. జగనన్న మద్యం సేవించి, బుర్రకు సంబంధించిన రుగ్మతలతో సైకాలజిస్ట్‌లను సంప్రదిస్తుండడం వల్ల వారు కూడా బాగానే ఉన్నారన్నారు. రాష్ట్రంలో సైకాలజిస్టుల సంఖ్య తక్కువగా ఉండడంతో, నాసిరకం మద్యం సేవించి ఇబ్బంది పడుతున్న వారు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారని అన్నారు.
బందరు నడుము కట్టుకు పెరిగిన గిరాకీ
బందర్లో గోస్వామి అనే వ్యక్తి నడుముకు పట్టీలు బాగా కడతారని తెలిసింది. ఆయన వద్దకు గతంలో 10 నుంచి 15 మంది ప్రతిరోజు వెళ్లే వారని, ప్రస్తుతం ఆయనకు వద్దకు ప్రతిరోజు పెద్ద సంఖ్యలోనే ప్రజలు క్యూ కడుతున్నారు. గోస్వామి లాంటి నడుముకు పట్టీలు వేసేవారు, ఆర్థోపెడిక్ డాక్టర్లు, నడుమునొప్పి మందులకు రాష్ట్రంలో విపరీతమైన డిమాండ్ ఉంది. రోడ్లపైనున్న గుంతల్లో పడి ఎంతోమంది క్షతగాత్రులు కావడం, మరి కొంతమంది మృత్యువాత పడడం నిత్య కృత్యంగా మారిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. మళ్లీ జగనే ఎందుకు సీఎం కావాలి అనే కార్యక్రమంలో రాపాక వరప్రసాద్ తో పాటు పాల్గొన్న, చిట్టిబాబు అనే వ్యక్తి గుంతలో పడి గాయపడితే ఆయన్ని రాపాక వరప్రసాద్ ఆసుపత్రిలో చేర్పించి దగ్గరుండి చికిత్స చేయించినట్లు తెలిపారు.
రాష్ట్రంలోని రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనదారులంతా గతుకుల మయమైన రోడ్లపై ప్రమాదానికి గురవుతుంటే, ముఖ్యమంత్రి మాత్రం రోడ్లపైనున్న గుంతల్లో పడరు. రైలు ప్రమాదం జరిగినా, వరదలు వచ్చినా, మూడు కిలోమీటర్ల దూరనికైనా ఆయన హెలికాప్టర్ లోనే ప్రయాణిస్తుంటారు. గాలి తిరుగుళ్ళు మాత్రమే తిరిగే జగన్, ఒక్కసారి రోడ్డుపై ప్రయాణించాలి. సామాన్యుల మాదిరిగానే నాలుగు నుంచి ఐదు గంటల పాటు రోడ్డు మార్గాన ప్రయాణించాలని రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. రాష్ట్ర రహదారులపై తిరిగితే, ఆయనకు గతుకుల మయమైన రోడ్ల దుస్థితి తెలుస్తుందని అన్నారు. కార్లలో, ఆర్టీసీ బస్సులలో తిరిగేవారికి నడుముల నొప్పులు తప్పడం లేదు. ఒక విధంగా దీనిని జగనన్న కుటుంబ నియంత్రణ పథకం అంటారేమోనని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఇలా ఉంటే, కనీసం పట్టించుకునే నాధుడు లేరని విమర్శించారు. మళ్లీ జగన్ రావాలని ప్రజల దగ్గరకు వస్తున్న అధికారులను, సిగ్గులేని ప్రజాప్రతినిధులను, రోడ్ల దుస్థితిపై ప్రజలు నిలదీయాలని కోరారు. రాష్ట్రంలో ఇటువంటి అధ్వానమైన రోడ్లు ఉన్నందుకు మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవాలా? అంటూ ప్రశ్నించారు.
చదవండి: Actor Chandra Mohan Passes away: ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత..!
హైకోర్టులో విచారణకు రానున్న చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు (నవంబర్ 15) నాడు హైకోర్టులో విచారణకు రానుందని రఘురామ తెలిపారు. గతవారంలో విచారణకు రాగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేరని ఈనెల 21వ తేదీకి వాయిదా వేయాలని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కోరారు. అయితే, న్యాయమూర్తి మాత్రం ఈనెల 15వ తేదీకి వాయిదా వేశారన్నారు. కోర్టులో విచారణ జరిగి వాదనలు పూర్తవుతాయా? లేదంటే మరుసటి రోజుకు వాయిదా పడతాయా అన్నది వేచి చూడాలి. అలాగే సుప్రీం కోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసు రిమాండ్ రిపోర్ట్ పిటిషన్ క్వాష్ చేయాలని చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై అవినీతి నిరోధక చట్టంలోని 17A నిబంధన ప్రకారం కొట్టివేస్తారనే ఆశాభావాన్ని ఎంపీ రఘురామ వ్యక్తం చేశారు.

Comments are closed.