తెలంగాణ రాష్ట్రంలో మరోసారి!గ్రూప్ -1 పరీక్ష రద్దు!

Share this :

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి గ్రూప్ -1 పరీక్ష రద్దు కావడంతో నిరుద్యోగుల ఆశలపై నీరుజల్లినట్లుంది.ముమ్మాటికీ ఇది ప్రభుత్వం తప్పని నిరుద్యోగులు మండిపడుతున్నారు. గతంలో పేపర్ లీకేజీ వలన ఒకసారి పరీక్షను రద్దుచేశారు అందుకని పరీక్షను మరలా రాయాల్సి వచ్చింది. మరలా నిర్వహించిన పరీక్ష లో ఈసారి అదనంగా ఓఎంఆర్ షీట్స్ వచ్చాయని అభ్యర్థులు హైకోర్టుకు వెళ్ళగా దానికి హైకోర్ట్ ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసింది.

మొదటిసారి జరిగిన తప్పుని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోలేదని ఈ సారి రుజువైంది లేకపోతే ఈ విధంగా జరిగేది కాదని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి నిరుద్యోగులు గ్రూప్ -1 వస్తుంది వస్తుంది అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అది కూడా ఇలా జరగడం వల్ల టీస్పీయసి బోర్డును ప్రక్షాళన చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది.

అనేక మంది దీనికోసం కోచింగ్ సెంటర్లు, హస్టల్స్ లకు లక్షలాది రూపాయలు ఖర్చు చేసారు. వయస్సు రీత్యా కూడా చాలా మందికి ఇదే చివరి అవకాశం.మరి ఇలాంటి వారీకి ప్రభుత్వం ఈ పరీక్ష నిర్వహాణలో జరిగిన లోపం వల్ల వారికీ ఎలాంటి భరోసా ఇవ్వలేదు.దీని వల్ల నిరుద్యోగులకి బోర్డు పై విశ్వాసం కోల్పోకుండా ఉండాలంటే వారికీ తక్షణం నష్టపరిహారం ఇవ్వాలని నిరుద్యోగుల సంఘం డిమాండ్ చేస్తుంది.

ఇంకా ముందు ముందు ఇలాంటి తప్పిదం జరకకుండా చూసుకోవాలని అన్నారు. గతంలో విద్యార్థులు, నిరుద్యోగులు డిమాండ్ చేసినట్లుగా ప్రభుత్వం కమిషన్ ను మార్చి ఉంటే పరీక్షలు నిర్వహించి ఉంటే ఇలాంటి పరిస్థితి మారే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం పై ఉన్న ఈ వ్యతిరేకత పోవాలంటే తక్షణమే ఒక్కొక్క కాండిడేట్ కి లక్ష నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా నిరుద్యోగులు అడుగుతున్నారు.